కెప్టెన్‌గా కోహ్లీ, ధోనీ రికార్డులను బద్దలుకొట్టిన రోహిత్

కెప్టెన్‌గా కోహ్లీ, ధోనీ రికార్డులను బద్దలుకొట్టిన రోహిత్

టీమిండియా తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మ టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీల రికార్డును బద్దలుకొట్టాడు. న్యూజిలాండ్ పర్యటనలో ఆడుతున్న రెండో ఫార్మాట్‌లో రెండో టీ20లో 7 వికెట్ల ఆధిక్యం దక్కించుకుని విజయంతో ముగించింది టీమిండియా. ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీ విశ్రాంతి తీసుకుంటూ సిరీస్‌కు దూరం కాగా, కెప్టెన్సీ బాధ్యతలు రోహిత్ శర్మ తీసుకున్నాడు. అయితే ఈ విజయంతో హిట్ మాన్ కెప్టెన్‌గా 12వ విజయాన్ని అందుకున్నాడు. 

టీ20కెరీర్‌లో 14మ్యాచ్‌లకు కెప్టెన్సీ వహించిన రోహిత్ శర్మ.. 12 మ్యాచ్‌లలో విజయాన్ని అందుకున్నాడు. ధోనీ, కోహ్లీలు 14 మ్యాచ్‌లకు కెప్టెన్లుగా వ్యవహరించి కేవలం 8మ్యాచ్‌లలోనే విజయాన్ని అందుకోగలిగారు. ఈ లిస్టులో రోహిత్‌కు సమంగా 12మ్యాచ్‌ల విజయం అందుకున్న సర్ఫరాజ్ అహ్మద్.. 11 మ్యాచ్‌లలో గెలిచిన షోయబ్ మాలిక్, అస్గర్ స్టానిక్‌జై… 10  మ్యాచ్‌లు గెలుచుకున్న వారిగా గ్రేమ్ స్మిత్, మహేలా జయవర్దనేలు నిలిచారు. 

ఈ మ్యాచ్ 16వ టీ20 హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్న రోహిత్.. పాకిస్తాన్ షోయబ్ మాలిక్, న్యూజిలాండ్ మార్టిన్ గఫ్తిల్‌ల అధిక పరుగుల రికార్డును కూడా అధిమగించేశాడు. శెుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‍‌లో టీమిండియా 159పరుగులు చేధించి 7వికెట్ల తేడాతో విజాయన్ని అందుకోగలిగింది.  మూడు మ్యాచ్‌ల టీ20సిరీస్‌ను ఈ మ్యాచ్‌తో సమం చేసిన భారత్.. ఆదివారం సెడాన్ పార్క్ స్టేడియం వేదికగా టైటిల్ పోరులో కివీస్‌తో తలపడనుంది.