Rohit Sharma: హిట్‌మ్యాన్ రోహిత్ శ‌ర్మ ఖాతాలో ప‌లు రికార్డులు

గుజ‌రాత్ టైటాన్స్‌( Gujarat Titans)తో జ‌రిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియ‌న్స్(Mumbai Indians,) కెప్టెన్ రోహిత్ శ‌ర్మ(Rohit Sharma) ప‌లు రికార్డుల‌ను సొంతం చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో మ‌హ్మ‌ద్ ష‌మీ బౌలింగ్‌లో సిక్స్ కొట్టిన రోహిత్ శ‌ర్మ ముంబై ఇండియ‌న్స్ త‌రుపున 200 సిక్స్‌లు బాదిన ఆట‌గాడిగా రికార్డుల‌కు ఎక్కాడు.

Rohit Sharma: హిట్‌మ్యాన్ రోహిత్ శ‌ర్మ ఖాతాలో ప‌లు రికార్డులు

Rohit Sharma 200 sixes for Mumbai Indians

Rohit Sharma 200 sixes for MI: ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(IPL) 2023 సీజ‌న్‌లో భాగంగా వాంఖ‌డే వేదిక‌గా గుజ‌రాత్ టైటాన్స్‌( Gujarat Titans)తో జ‌రిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియ‌న్స్(Mumbai Indians,) కెప్టెన్ రోహిత్ శ‌ర్మ(Rohit Sharma) ప‌లు రికార్డుల‌ను సొంతం చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో మ‌హ్మ‌ద్ ష‌మీ బౌలింగ్‌లో సిక్స్ కొట్టిన రోహిత్ శ‌ర్మ ముంబై ఇండియ‌న్స్ త‌రుపున 200 సిక్స్‌లు బాదిన ఆట‌గాడిగా రికార్డుల‌కు ఎక్కాడు.

ఐపీఎల్ ఆరంభ సీజ‌న్ల‌లో డెక్క‌న్ ఛార్జ‌ర్స్ కు ఆడిన రోహిత్ శ‌ర్మ మూడు సీజ‌న్ల త‌రువాత 2011లో ముంబై ఇండియ‌న్స్‌కు వ‌చ్చాడు. అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ముంబై త‌రుపున ఆడుతున్న రోహిత్ శ‌ర్మ కెప్టెన్‌గా ఐదు సార్లు ముంబైకి క‌ప్‌ను అందించాడు. ఈ క్ర‌మంలో ప‌లు రికార్డులు అత‌డి ఖ‌తాలో వ‌చ్చి చేరాయి. ఇక ఇదే మ్యాచ్‌లో మ‌రో రికార్డును అందుకున్నాడు.

IPL 2023:ఒకే ఓవ‌ర్‌లో రెండు వికెట్లు కోల్పోయిన ముంబై..Updates

అత్య‌ధిక సిక్స్‌లు కొట్టిన రెండో ఆట‌గాడిగా

ఐపీఎల్‌లో మ‌రో రికార్డు రోహిత్ ఖాతాలో వ‌చ్చి చేరింది. ఈ మ్యాచ్‌లో రెండు సిక్స్‌లు కొట్ట‌గానే ఐపీఎల్‌లో అత్య‌ధిక సిక్స్‌లు కొట్టిన ఆట‌గాళ్ల జాబితాలో రెండో స్థానానికి చేరుకున్నాడు. ఇంత‌క‌ముందు వ‌ర‌కు ఈ రికార్డు డివిలియ‌ర్స్‌(251) పేరిట ఉండేది. మొత్తంగా రోహిత్ శ‌ర్మ ఇప్ప‌టి వ‌ర‌కు ఐపీఎల్‌లో 252 సిక్స్‌లు కొట్టాడు. ఈ జాబితాలో వెస్టిండీస్ విధ్వంస‌క‌ర వీరుడు క్రిస్‌గేల్(357) అగ్ర‌స్థానంలో ఉన్నాడు.

ఐపీఎల్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆట‌గాళ్లు వీరే

– క్రిస్ గేల్ 357
– రోహిత్ శర్మ 252
– ఏబీ డివిలియర్స్ 251
– ఎంఎస్ ధోని 239

ఇక ఈ మ్యాచ్‌లో రోహిత్ శ‌ర్మ 18 బంతులు ఎదుర్కొని 3 ఫోర్లు, 2 సిక్స‌ర్ల‌తో 29 ప‌రుగులు చేశాడు.