IPL 2021: రితికాను ప్రాంక్ వీడియోతో భయపెట్టిన రోహిత్ శర్మ

రోహిత్ శర్మ.. ఇన్‌స్టాగ్రామ్ భార్య రితికా సజ్దేశ్ తో చేసిన ఫ్రాంక్ వీడియో పోస్టు చేశాడు. చాక్లెట్ పెట్టుకుని నేరుగా..

IPL 2021: రితికాను ప్రాంక్ వీడియోతో భయపెట్టిన రోహిత్ శర్మ

Rohit Sharma Ritika

IPL 2021: టోర్నీ ఫేవరేట్ గా బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేస్తుందని భావించారు. కానీ, ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ప్లే ఆఫ్ చేరుకోవడానికి తక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. కెప్టెన్ గా టీంను బూస్ట్ చేస్తూ వ్యక్తిగత ప్రదర్శన బాగానే ఉన్నా జట్టుపరంగా ముంబై ఇండియన్స్ రాణించలేకపోతుంది. పాయింట్ల పట్టికలో పైకి చేరుకోవడానికి నానాతంటాలు పడుతున్నా లాభం లేదు.

ఇప్పటివరకూ 12మ్యాచ్ లు ఆడి 10పాయింట్లతో చివరి నుంచి రెండో స్థానంలో ఉంది ముంబై ఇండియన్స్. గేమ్ ఒత్తిడి నుంచి బయటపడటానికి ఫ్యామిలీతో స్పెండ్ చేస్తున్న రోహిత్ శర్మ.. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ పోస్టు పెట్టాడు. తన భార్య రితికా సజ్దేశ్ తో చేసిన ఫ్రాంక్ వీడియో పోస్టు చేశాడు. ఇందులో అతని భార్య మాత్రమే కనిపిస్తుండగా వీడియోను 13లక్షల మంది చూడగా 14వేల కామెంట్లు వచ్చాయి.

తన చేతిలో చాక్లెట్ పెట్టుకుని చూపించి దానిని దాచిపెట్టి నేరుగా భార్య దగ్గరకు వెళ్లాడు. చేయి మూసి దాచి ఉంచి రితికా దగ్గరకు వెళ్లేసరికి ఆమె భయపడుతూ ఉంది. కాసేపు అలా ఆమెను భయపెట్టి తర్వాత చాక్లెట్ తీసి చూపించేసరికి భయపడినందుకు సిగ్గుతో మొహం చాటేసింది. నిన్ను భయపెడుతున్నానుకున్నావా.. చేతిలో ఏం లేదు రితికా.. ఒట్టుగా చెబుతున్నా అంటూ రోహిత్ మాటలు వీడియోలో వినిపించాయి.

 

……………………………………………..: బుమ్రా ఫాస్ట్ బౌలింగే కాదు.. ఫొటోలు కూడా హాట్‌గా తీయగలడు!!

రోహిత్ ప్రస్తుతం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో ఐపీఎల్ కోసం ఉన్నాడు. ప్లేయర్లంతా ఫ్యామిలీలతో పాటు అక్కడికి వెళ్లడంతో ఆటతో పాటు అక్కడి ఏరియాల్లో తిరుగుతూ సోషల్ మీడియాల్లో యాక్టివ్ గా ఉంటున్నారు.