Rohit Sharma: కోహ్లీని పొగిడేస్తున్న రోహిత్ శర్మ

పరిమిత ఓవర్ల ఫార్మాట్ కు రెగ్యూలర్ కెప్టెన్ అయిన రోహిత్ శర్మ.. టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీని తెగ పొగిడేస్తున్నాడు. ఇప్పటికే రోహిత్ ను కెప్టెన్ చేయడంపై సర్వత్రా విమర్శలు...

Rohit Sharma: కోహ్లీని పొగిడేస్తున్న రోహిత్ శర్మ

Rohit Sharma

Rohit Sharma: పరిమిత ఓవర్ల ఫార్మాట్ కు రెగ్యూలర్ కెప్టెన్ అయిన రోహిత్ శర్మ.. టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీని తెగ పొగిడేస్తున్నాడు. ఇప్పటికే రోహిత్ ను కెప్టెన్ చేయడంపై విమర్శలు వినిపిస్తుండటంతో రోహిత్.. కోహ్లీ పట్ల పాజిటివ్ గా మాట్లాడటం కాస్త మంచికే అనిపిస్తుంది. మొన్నటివరకూ కోహ్లీ కెప్టెన్సీలో ఆడిన రోహిత్ ప్రతిక్షణాన్ని ఎంజాయ్ చేశానని అంటున్నాడు.

‘ఎప్పుడూ వెనక్కు చూసుకునే పరిస్థితి లేనట్లుగా టీంను తీర్చిదిద్దాడు. ఐదేళ్లుగా జట్టును నడిపిస్తున్నాడు. ప్రతి క్షణం ముందుండి జట్టును సెట్ చేసేవాడు. ప్రతి గేమ్ లో పూర్తి స్పష్టతతోనే ముందుకెళ్లేవాడు. జట్టుగా ఒకటే చెబుతున్నా. అతని నేతృత్వంలో ఆడటం చాలా గొప్పగా అనిపిస్తుంది. ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేస్తున్నా. ఇప్పుడూ అదే కొనసాగిస్తా’ అని రోహిత్ శర్మ వీడియో రిలీజ్ చేశాడు.

ఒక టీంగా ఇంకా బెటర్ కావాల్సి ఉంది. వ్యక్తిగత నైపుణ్యాలు పెంచుకుని మెరుగవుతాం. నేనొక్కడినే కాదు.. టీం మొత్తాన్ని ముందుకు తీసుకెళ్తా. అదే చేయడానికి ప్రయత్నిస్తున్నాం’ అని రోహిత్ చెప్పుకొచ్చాడు.

 

…………………………….. : కాలభైరవుడికి మోదీ ప్రత్యేక పూజలు

దక్షిణాఫ్రికాతో జరగబోయే టెస్టు ఫార్మాట్ కు విరాట్ కోహ్లీ కెప్టెన్సీ వహిస్తుండగా.. రోహిత్ శర్మ వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తాడు. డిసెంబర్ 26 నుంచి జరగనున్న ఈ మ్యాచ్ కోసం డిసెంబర్ 16నుంచే బయోబబుల్ లోకి వెళ్లనుంది టీమిండియా.