WTC Final 2023: డబ్ల్యూటీసీ ఫైనల్‌లో రోహిత్ శర్మ ఒక్క బంతిని సరిగ్గా కనెక్ట్ చేసినా చాలు..
టీ20లు, వన్డేలతో పోలిస్తే సాధారణంగా టెస్టు క్రికెట్‌లో సిక్సర్ల సంఖ్య చాలా తక్కువగా నమోదు అవుతాయన్న సంగతి తెలిసిందే. భారత్ తరుపున ఇప్పటి వరకు ఎవరు అత్యధిక సిక్సర్లు కొట్టారు అన్నది మీకు తెలుసా..?

Rohit Sharma-Sachin Tendulkar
WTC Final 2023-Rohit Sharma: ప్రతిష్టాత్మక డబ్ల్యూటీసీ ఫైనల్(WTC Final 2023) మ్యాచ్‌కు ఒక రోజు మాత్రమే మిగిలి ఉంది. మొదటి ఎడిషన్‌లో ఫైనల్‌కు చేరుకున్నప్పటికి న్యూజిలాండ్(New Zealand) చేతిలో ఓడిపోయింది భారత్(Team India). రెండవ ప్రయత్నంలోనైనా డబ్ల్యూటీసీ విజేతగా టీమ్ఇండియా నిలవాలని సగటు భారత క్రికెట్ అభిమాని కోరుకుంటున్నాడు. లండన్‌లోని ఓవల్ మైదానంలో ఆస్ట్రేలియా(Australia)తో భారత్ బుధవారం నుంచి అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ(Rohit Sharma) ఓ రికార్డుపై కన్నేశాడు.
టీ20లు, వన్డేలతో పోలిస్తే సాధారణంగా టెస్టు క్రికెట్‌లో సిక్సర్ల సంఖ్య చాలా తక్కువగా నమోదు అవుతాయన్న సంగతి తెలిసిందే. భారత్ తరుపున ఇప్పటి వరకు ఎవరు అత్యధిక సిక్సర్లు కొట్టారు అన్నది మీకు తెలుసా..? అతడు మరెవరో కాదు. విధ్వంసకర వీరుడు వీరేంద్ర సెహ్వాగ్. 180 టెస్టు ఇన్నింగ్స్‌ల్లో వీరూ 91 సిక్సర్లు బాదాడు. ఇక రెండో స్థానంలో భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ఉన్నాడు. 144 టెస్టు ఇన్నింగ్స్‌ల్లో 78 సిక్సర్లు కొట్టాడు.
Rohit Sharma: రేపటి నుంచి డబ్ల్యూటీసీ ఫైనల్.. రోహిత్ శర్మకు గాయం..! ఆందోళనలో అభిమానులు
రోహిత్ ఒక్క సిక్స్ కొడితే..
ఇక మూడో స్థానంలో సచిన్ టెండూల్కర్, రోహిత్ శర్మలు చెరో 69 సిక్సర్లు బాది సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నారు. 329 ఇన్నింగ్స్‌ల్లో సచిన్ ఈ సిక్స్‌లు కొట్టగా హిట్‌మ్యాన్ కేవలం 83 ఇన్నింగ్స్‌ల్లోనే సాధించాడు. డబ్ల్యూటీసీ ఫైనల్‌లో రోహిత్ మరో సిక్స్ కొడితే సచిన్ ను అధిగమిస్తాడు. ఫామ్‌లో ఉన్నా లేకపోయినా ఒక్క సిక్స్ మాత్రమే కాబట్టి రేపటి మ్యాచ్‌లోనే ఈ రికార్డును రోహిత్ అందుకునే అవకాశం ఉంది. వీరిద్దరి తరువాత 184 టెస్టు ఇన్నింగ్స్‌ల్లో 61 సిక్సర్లతో కపిల్ దేవ్ ఉన్నాడు.
WTC ఫైనల్‌కు భారత జట్టు ఇదే:
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, కేఎస్ భరత్ (వికెట్లు), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్, ఇషాన్ కిషన్ (వికెట్)
Virat Kohli: డబ్ల్యూటీసీ ఫైనల్‌లో పలు రికార్డులపై విరాట్ కోహ్లి కన్ను.. అవేంటంటే..?
స్టాండ్‌బై ఆటగాళ్లు: యశస్వి జైశ్వాల్, ముఖేష్ కుమార్, సూర్యకుమార్ యాదవ్.