Hardik Pandya: హార్దిక్ పాండ్యాను టీ20 ప్రపంచకప్ జట్టు నుంచి తప్పిస్తారా?

మిడిల్ ఆర్డర్‌‍లో హార్దిక్ పాండ్యా ఎలా చెలరేగిపోతాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

Hardik Pandya: హార్దిక్ పాండ్యాను టీ20 ప్రపంచకప్ జట్టు నుంచి తప్పిస్తారా?

Hardik Pandya

Hardik Pandya: మిడిల్ ఆర్డర్‌‍లో హార్దిక్ పాండ్యా ఎలా చెలరేగిపోతాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే, పాండ్యా రాబోయే టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లకు దూరం కానున్నారా? అంటే అవుననే అనుమానాలే వ్యక్తం చేస్తున్నారు. ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఫిట్‌నెస్‌పై ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన కామెంట్లతో హార్దిక్ పాండ్యా టీ20 వరల్డ్ కప్ భారత జట్టులో అతను ఉండడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఐపీఎల్ 2021లో సెకండాఫ్ మ్యాచ్‌లు అయిపోయిన తర్వాత ప్రతిష్టాత్మక టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌ల్లో భారత జట్టు ఆడాల్సి ఉంది. అయితే, అంతకుముందుగా జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌ల్లో పేలవమైన హార్దిక్ పాండ్యా పెర్ఫామెన్స్ ఇప్పుడు భారత జట్టును ఆందోళనకు గురిచేస్తుంది. అతని బౌలింగ్ ఫిట్‌నెస్ ఆందోళనకరంగా ఉందని రోహిత్ శర్మ కూడా ఇప్పటికే చెప్పారు.

ఐపీఎల్ సెకండాఫ్ మొదటి రెండు మ్యాచ్‌ల తర్వాత హార్దిక్ ముంబై టీమ్ తరపున ఎంట్రీ ఇచ్చాడు. అయితే, అప్పుడు కూడా హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేయలేదని, హార్దిక్ గాయాన్ని ఫిజయోలు, ట్రైనర్లు, మెడికల్ టీమ్ పర్యవేక్షిస్తున్నట్లు రోహిత్ శర్మ చెప్పాడు. ఇప్పట్లో హార్దిక్ బౌలింగ్‌కు ఫిట్ అయ్యే అవకాశం లేదని కూడా చెబుతున్నారు. ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్‌కు హార్దిక్ అందుబాటులో ఉంటాడా? లేదా? అనేది అనుమానమే అంటున్నారు.