Rohit Sharma: టెస్టు సిరీస్ నుంచి రోహిత్ శర్మ ఔట్

దక్షిణాఫ్రికాతో మరికొద్ది రోజుల్లో జరగనున్న టెస్టు సిరీస్ కు టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్ రోహిత్ శర్మ దూరం కానున్నాడు. ఎడమచేతి మణికట్టుకు గాయం కావడంతో మూడు టెస్టుల సిరీస్ కు....

Rohit Sharma: టెస్టు సిరీస్ నుంచి రోహిత్ శర్మ ఔట్

Rohit-Sharma

Rohit Sharma: దక్షిణాఫ్రికాతో మరికొద్ది రోజుల్లో జరగనున్న టెస్టు సిరీస్ కు టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్ రోహిత్ శర్మ దూరం కానున్నాడు. ఎడమచేతి మణికట్టుకు గాయం కావడంతో మూడు టెస్టుల సిరీస్ కు దూరం కానున్నాడు. అతని స్థానంలో ప్రియాంక పంచాల్ టెస్టులకు హాజరుకానుండగా.. వైస్ కెప్టెన్ స్థానం ఇంకా కన్ఫామ్ కాలేదని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి.

1974-75లో బెంగళూరు వేదికగా వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో.. మన్సూర్ అలీ ఖాన్ పటౌడీకి డిప్యూటీగా సునీల్ గవాస్కర్ ఆడాలని సెలక్షన్ కమిటీ పర్సనల్ గా చెప్పినట్లు.. ఇప్పుడు కూడా పబ్లిక్ అనౌన్స్ మెంట్ లేకుండానే పనిజరిగింది.

ముంబైలో సోమవారం ప్రాక్టీస్ సెషన్ జరుగుతుండగా.. టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ కు గాయమైంది. దక్షిణాఫ్రికాతో రాబోయే మూడు టెస్టుల మ్యాచ్ కు దూరం కానున్నాడు. మెడికల్ టెస్టు రిపోర్టులు రావాల్సి ఉంది. డిసెంబర్ 26 నుంచి తొలి టెస్టు ఆరంభం కానుండగా.. తొలి వన్డే జనవరి 19నుంచి మొదలవుతుంది.

………………………………: ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీగా క్రాస్ ఓటింగ్