Rohit-Shubman Gill: సెంచరీలతో చెలరేగిన ఓపెనర్లు.. శతక్కొట్టిన రోహిత్, గిల్

ఓపెనర్లుగా వచ్చిన కెప్టెన్ రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ ఆరంభం నుంచి దూకుడుగా ఆడుతూ రెచ్చిపోయారు. కివీస్ బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా పరుగుల వరద పారించారు. రోహిత్, గిల్ ఇద్దరూ సెంచరీలు సాధించారు. ఇద్దరు ఓపెనర్లూ ఒకేసారి సెంచరీ సాధించడం విశేషం.

Rohit-Shubman Gill: సెంచరీలతో చెలరేగిన ఓపెనర్లు.. శతక్కొట్టిన రోహిత్, గిల్

Rohit-Shubman Gill: న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో భారత ఓపెనర్లు సెంచరీలతో చెలరేగారు. ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ సెంచరీలు సాధించారు. తొలి వికెట్‌కు 212 పరుగులు జోడించారు. ఇండోర్ వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో న్యూజిలాండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.

Pawan kalyan ‘VARAHI’ : ‘వారాహి’వాహనానికి పూజలు .. పొత్తుల గురించి పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు

దీంతో కెప్టెన్ రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ ఓపెనర్లుగా వచ్చారు. ఆరంభం నుంచి ఇద్దరూ దూకుడుగా ఆడుతూ రెచ్చిపోయారు. కివీస్ బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా పరుగుల వరద పారించారు. రోహిత్, గిల్ ఇద్దరూ సెంచరీలు సాధించారు. ఇద్దరు ఓపెనర్లూ ఒకేసారి సెంచరీ సాధించడం విశేషం. రోహిత్ శర్మ 83 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్సర్లతో సెంచరీ సాధించాడు. ఆ వెంటనే శుభ్‌మన్ గిల్ కూడా 72 బంతుల్లోనే 13 ఫోర్లు, 4 సిక్సర్లతో సెంచరీ చేశాడు. వన్డేల్లో ఇది రోహిత్‌కు 30వ సెంచరీ కాగా, శుభ్‌మన్ గిల్‌కు నాలుగో సెంచరీ. రోహిత్ శర్మ మూడేళ్ల తర్వాత వన్డే సెంచరీ నమోదు చేయడం విశేషం.

Rahul Gandhi: సర్జికల్ స్ట్రైక్స్‌పై ఎలాంటి ఆధారాలు అక్కర్లేదు.. దిగ్విజయ్ వ్యాఖ్యలు సరికాదు: రాహుల్ గాంధీ

చివరగా రోహిత్ 2020 జనవరిలో సెంచరీ చేశాడు. రోహిత్ సెంచరీ సాధించిన తర్వాత ఎదుర్కొన్న రెండో బంతికే బ్రేస్‌వెల్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యి 101 పరుగుల వద్ద వెనుదిరిగాడు. అనంతరం శుభ్‌మన్ గిల్ కూడా 78 బంతుల్లో 112 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇక ఈ మధ్య గిల్ మంచి ఫామ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన మ్యాచ్‌లో గిల్ డబుల్ సెంచరీ సాధించాడు. రోహిత్ ఔట్ అయిన తర్వాత విరాట్ కోహ్లీ వన్ డౌన్‌గా రాగా, గిల్ అనంతరం ఇషాన్ కిషన్ బ్యాటింగ్‌కు దిగాడు.

ఇప్పటికే భారత్ 28 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి, 230 పరుగులు సాధించింది. ప్రస్తుతం భారత రన్ రేటు 8.2గా ఉంది. ఇదే రన్ రేటు కొనసాగితే భారత స్కోరు 400 దాటడం ఖాయం. ఇప్పటికే వరుసగా రెండు వన్డేల్లో విజయం సాధించిన భారత్ సిరీస్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ కూడా గెలిస్తే సిరీస్ క్లీన్ స్వీప్ అవుతుంది.