Rohit Sharma : భారత్‌కు బిగ్ షాక్.. టెస్ట్ సిరీస్ నుంచి రోహిత్ శర్మ ఔట్..!

సౌతాఫ్రికా పర్యటనకు ముందు భారత జట్టుకు ఇది బిగ్ షాక్ అనే చెప్పాలి. హిట్ మ్యాన్, జట్టు వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ టెస్ట్ సిరీస్ కు దూరం కానున్నాడని తెలుస్తోంది.

Rohit Sharma : భారత్‌కు బిగ్ షాక్.. టెస్ట్ సిరీస్ నుంచి రోహిత్ శర్మ ఔట్..!

Rohit Sharma

Rohit Sharma : సౌతాఫ్రికా పర్యటనకు ముందు భారత జట్టుకు ఇది బిగ్ షాక్ అనే చెప్పాలి. హిట్ మ్యాన్, జట్టు వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ టెస్ట్ సిరీస్ కు దూరం కానున్నాడని తెలుస్తోంది. గాయం కారణంగా రోహిత్ కు రెస్ట్ ఇచ్చినట్టు సమాచారం. ప్రాక్టీస్ సెషన్‌లో రోహిత్ గాయపడినట్లు నివేదికలు చెబుతున్నాయి. ముంబైలో జరిగిన ప్రాక్టీస్ సెషన్‌లో త్రోడౌన్ స్పెషలిస్ట్ రాఘవేంద్ర వేసిన బంతి రోహిత్‌ చేతిని బలంగా తాకిందని, దీంతో అతడు కాపేపు నొప్పితో విలవిలలాడినట్లు నివేదికలు తెలుపుతున్నాయి. ప్రస్తుతం ఆ గాయం తీవ్రంగా మారినట్లు సమాచారం. దీంతో టెస్ట్‌ సిరీస్‌ నుంచి రోహిత్ తప్పుకున్నట్లు తెలుస్తోంది.

Twitter New Feature : ట్విట్టర్‌లో టిక్‌టాక్‌ లాంటి కొత్త ఫీచర్.. వర్టికల్ వీడియో ఫీడ్..!

జనవరి 19 నుంచి ప్రారంభం కానున్న వన్డే సిరీస్‌కు కూడా రోహిత్ అందుబాటులో ఉంటాడా? లేదా? అనేదానిపై క్లారిటీ రావాల్సి ఉంది. కాగా, దీనిపై బీసీసీఐ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. దక్షిణాఫ్రికాతో ప్రారంభం కానున్న వన్డే సిరీస్‌తో రోహిత్‌ కెప్టెన్‌గానూ, టెస్టు సిరీస్‌కు వైస్‌ కెప్టెన్‌గానూ వ్యవహరించనున్నాడు.

WhatsApp Privacy Update : వాట్సాప్‌లో న్యూ అప్‌డేట్.. ఈ కొత్త ప్రైవసీతో వారికి చెక్ పెట్టొచ్చు..!

ప్రస్తుతం భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటన కోసం ముంబైలోని ఓ హోటల్‌లో మూడు రోజుల క్వారంటైన్ లో ఉంది. డిసెంబర్ ‌16న సౌతాఫ్రికాకు పయనం కానుంది. డిసెంబర్ 26 నుంచి సౌతాఫ్రికాతో మూడు మ్యాచుల టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. కాగా, రోహిత్ స్ధానంలో భారత్‌-ఏ జట్టు కెప్టెన్‌ ప్రియాంక్‌ పంచల్‌ జట్టులోకి రానున్నాడు. గుజరాత్ కి చెందిన ఓపెనర్ పంచల్ భారత్ ఏ తరఫున 3 ఇన్నింగ్స్ ల్లో 120 పరుగులు చేశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో 24 సెంచరీలు బాదాడు.