రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డుకు రోహిత్ శర్మ

రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డుకు రోహిత్ శర్మ

క్రీడల్లో అత్యున్నత పురస్కారమైన రాజీవ్‌గాంధీ ఖేల్‌ రత్నా అవార్డును టీమిండియా ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ, రెజ్లర్ వినేశ్ ఫోగట్‌లను రాజీవ్ గాంధీ ఖేల్ రత్నా అవార్డుకు కేంద్రం రికమెండ్ చేసింది. టేబుల్‌ టెన్నిస్‌ సంచలనం మానిక బాత్రా, రియో పారా ఒలింపిక్స్‌ గోల్డ్ మెడలిస్ట్‌ మరియప్పన్‌ తంగవేలు పేర్లను ప్రతిష్టాత్మక పురస్కారానికి రిఫర్ చేశారు.



మొత్తం 12 మంది సెలక్షన్‌ కమిటీ సభ్యులు ప్రతిష్టాత్మక అవార్డుకు నామినేట్‌ చేసినట్లు మంగళవారం పేర్కొంది. క్రీడా శాఖ ఆధ్వర్యంలో అత్యున్న‌త క్రీడా అవార్డుకు న‌లుగురు క్రీడాకారులు నామినేట్ కావ‌డం ఇది రెండోసారి. 2016లో కూడా న‌లుగురు క్రీడాకారుల్ని అవార్డు కోసం నామినేట్ చేశారు.



2019 ఏడాదిలో రోహిత్ శ‌ర్మ బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపించాడు. ఆ సీజ‌న్‌లో రోహిత్ వ‌న్డేలో 7 సెంచ‌రీలతో మొత్తం 1490 పరుగులు చేశాడు. ఏడాది మొత్తం క్రికెట్‌లో అత్యున్నత ప్రదర్శనకు గానూ రోహిత్‌ శర్మను ప్రతిష్టాత్మక అవార్డుకు సిఫారసు చేసినట్లు కమిటీలో సభ్యుడైన మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ పేర్కొన్నాడు. 2018లో జరిగిన కామన్‌వెల్త్‌ గేమ్స్‌, ఆసియా గేమ్స్‌లో బంగారు పతకాలు, 2019 ఆసియా రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం సాధించి వినేశ్ ఫోగట్‌ చరిత్ర సృష్టించారు.



మరియప్పన్‌ తంగవేలు.. 2016లో రియో పారా ఒలింపిక్స్‌లో టీ42 హై జంప్‌ కేటగిరి విభాగంలో బంగారు పతకం సాధించి దేశ ఖ్యాతిని ఖండాంతరాలకు చాటి చెప్పాడు. టేబుల్‌ టెన్నిస్‌ సంచలనంగా పేరు పొందిన మానిక బాత్రా 2018 నుంచి అత్యద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటుంది. కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో బంగారు పతకం, ఆసియా గేమ్స్‌లో క్యాంస్య పతకం సాధించి తన సత్తాను చాటింది.



ఇండియన్‌ క్రికెట్‌లో గతంలో ముగ్గురు మాత్రమే రాజీవ్‌గాంధీ ఖేల్‌ రత్న అవార్డుకు ఎంపికయ్యారు. 1998లో మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌, 2007లో టీమిండియా మాజీ ప్లేయర్ ఎంఎస్‌ ధోని, టీమిండియా కెప్టెన్‌ విరాట్‌(2018)లో సెలక్ట్ అయ్యారు.