FIFA World Cup 2022: అయ్యో.. నెరవేరని రొనాల్డో కల.. కన్నీళ్లతో మైదానాన్ని వీడిన స్టార్ ఆటగాడు..

రొనాల్డో కల కలగానే మిగిలిపోయింది. 56ఏళ్ల నిరీక్షణకు తెరదించాలని ఖతార్ గడ్డపై అడుగు పెట్టిన పోర్చుగల్ జట్టుకు మరోసారి నిరాశే ఎదురైంది. శనివారం జరిగిన ఫిఫా ప్రపంచ క్వార్టర్ ఫైనల్లో ఆఫ్రికా జట్టు మొరాకో చేతిలో పోర్చుగల్ ఓటమి పాలైంది.

FIFA World Cup 2022: అయ్యో.. నెరవేరని రొనాల్డో కల.. కన్నీళ్లతో మైదానాన్ని వీడిన స్టార్ ఆటగాడు..

Ronaldo

FIFA World Cup 2022: రొనాల్డో కల కలగానే మిగిలిపోయింది. 56ఏళ్ల నిరీక్షణకు తెరదించాలని ఖతార్ గడ్డపై అడుగు పెట్టిన పోర్చుగల్ జట్టుకు మరోసారి నిరాశే ఎదురైంది. శనివారం జరిగిన ఫిఫా ప్రపంచ క్వార్టర్ ఫైనల్లో ఆఫ్రికా జట్టు మొరాకో చేతిలో పోర్చుగల్ ఓటమి పాలైంది. ఫలితంగా ఆ జట్టు స్టార్ ఆటగాడు రొనాల్డో తన ఆఖరి ప్రపంచకప్‌లోనైనా జట్టుకు ట్రోఫీని అందించాలన్న కల నెరవేరక పోవటంతో మైదానంలోనే వెక్కివెక్కి ఏడ్చాడు. డ్రసింగ్ రూంకు వెళ్లేంత వరకు రొనాల్డో కన్నీరు పెడుతూనే కనిపించాడు.

Cristiano Ronaldo

Cristiano Ronaldo

శనివారం మొరాకో – పోర్చుగల్ జట్ల మధ్య హోరాహోరీగా సాగిన మ్యాచ్ లో మొరాకో జట్టు 1-0 తేడాతో విజయం సాధించింది. దీంతో హాట్ ఫేవరెట్ జట్టు పోర్చుగల్ ఇంటిదారి పట్టాల్సి వచ్చింది.

Cristiano Ronaldo

Cristiano Ronaldo

ఇదిలాఉంటే.. క్రిస్టియానో రొనాల్డోను టీం మేనేజ్మెంట్ ఈ మ్యాచ్ లోనూ ఆరంభంలో ఆడించలేదు. 37ఏళ్ల రొనాల్డోను 51వ నిమిషంలో సబ్ స్టిట్యూట్ ప్లేయర్ గా బరిలోకి దించారు. అయితే, మొరాకో పటిష్ఠ డిఫెన్స్ ముందు రొనాల్డో తలవంచాడు. మరోవైపు సెమీఫైనల్ కు చేరుకున్న తొలి ఆఫ్రికా జట్టుగా మొరాకో చరిత్ర సృష్టించింది.

Cristiano Ronaldo

Cristiano Ronaldo

ఇదిలాఉంటే.. ఎన్నో గోప్ప ట్రోఫీలను సాధించిన రోనాల్డో.. ప్రపంచకప్‌ టైటిల్‌ లేకుండానే తన కెరీర్‌ను ముగించాల్సి వస్తుంది. తన వయస్సు దృష్ట్యా రోనాల్డోకు ఇదే ఆఖరి ప్రపంచకప్‌ అయ్యే అవకాశం ఉంది. దీంతో ఖతార్ లో జరిగే ప్రపంచ కప్ లో జట్టుకు కప్ అందించి తన కలను నెరవేర్చుకోవాలని రొనాల్డో భావించాడు. కానీ, రొనాల్డో ఆశలు కలగానే మిగిలిపోయాయి.