IPL 2023: విజృంభించిన ఆర్‌సీబీ బౌల‌ర్లు.. 59 ప‌రుగుల‌కే రాజ‌స్థాన్ ఆలౌట్‌.. బెంగ‌ళూరు ప్లే ఆఫ్స్ ఆశ‌లు స‌జీవం

ప్లే ఆఫ్స్ అవ‌కాశాలు స‌జీవంగా ఉండాలంటే త‌ప్ప‌క గెల‌వాల్సిన మ్యాచ్‌లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు బౌల‌ర్లు విజృంభించారు. ఫ‌లితంగా ల‌క్ష్య ఛేద‌న‌లో రాజ‌స్థాన్ 10.3 ఓవ‌ర్ల‌లో 59 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది.

IPL 2023: విజృంభించిన ఆర్‌సీబీ బౌల‌ర్లు.. 59 ప‌రుగుల‌కే రాజ‌స్థాన్ ఆలౌట్‌.. బెంగ‌ళూరు ప్లే ఆఫ్స్ ఆశ‌లు స‌జీవం

RCB win against RR

RR vs RCB:ప్లే ఆఫ్స్ అవ‌కాశాలు స‌జీవంగా ఉండాలంటే త‌ప్ప‌క గెల‌వాల్సిన మ్యాచ్‌లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు(Royal Challengers Bangalore,) బౌల‌ర్లు విజృంభించారు. ఫ‌లితంగా ల‌క్ష్య ఛేద‌న‌లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌(Rajasthan Royals) 10.3 ఓవ‌ర్ల‌లో 59 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. దీంతో బెంగ‌ళూరు 112 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. ఈ ఓట‌మితో రాజ‌స్థాన్ ప్లే ఆఫ్స్ అవ‌కాశాలు సంక్లిష్టం కాగా.. బెంగ‌ళూరు అవ‌కాశాలు మెరుగు అయ్యాయి.

172 ప‌రుగుల లక్ష్యంతో బ‌రిలోకి దిగిన రాజ‌స్థాన్ ఏ ద‌శలోనూ ల‌క్ష్యం దిగుతున్న‌ట్లుగా అనిపించ‌లేదు. సూప‌ర్ ఫామ్‌లో ఉన్న య‌శ‌స్వి జైపాల్(0) ను సిరాజ్ తొలి ఓవ‌ర్‌లోనే ఔట్ చేయ‌గా రెండో ఓవ‌ర్‌లో బ‌ట్ల‌ర్(0)ల‌తో పాటు కెప్టెన్ సంజు శాంస‌న్ ల‌ను వేన్ పార్నెల్ పెవిలియ‌న్‌కు చేర్చాడు. దీంతో రాజ‌స్థాన్ 7 ప‌రుగుల‌కే మూడు వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డింది. ఆదుకుంటాడు అనుకున్న రూట్‌(10), ప‌డిక్క‌ల్‌(4)లు కూడా చేతులెత్తేయ‌డంతో రాజ‌స్థాన్ ఓ ద‌శ‌లో 28 ప‌రుగుల‌కే 5 వికెట్లు కోల్పోయింది.

IPL 2023: రాజ‌స్థాన్‌పై బెంగ‌ళూరు ఘ‌న విజ‌యం

ఈ ద‌శ‌లో ఐపీఎల్‌లో అత్య‌ల్ప స్కోరు న‌మోదు చేసేలా క‌నిపించింది. అయితే.. షిమ్రోన్ హెట్మెయర్(35; 19 బంతుల్లో 1 ఫోర్‌, 4 సిక్స్‌లు) కాస్త ధాటిగా బ్యాటింగ్ చేయ‌డంతో 50 ప‌రుగులు దాటింది ప‌రువు ద‌క్కించుకుంది. ధ్రువ్ జురెల్‌(1), అశ్విన్‌(0) కూడా విఫ‌లం కావ‌డం,హెట్మెయర్ ఔట్ కావ‌డంతో రాజ‌స్థాన్ ఇన్నింగ్స్ ముగిసేందుకు ఎక్కువ స‌మ‌యం ప‌ట్ట‌లేదు. ఆర్‌సీబీ బౌల‌ర్ల‌లో వేన్ పార్నెల్ మూడు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా, బ్రేస్‌వెల్, కర్ణ్ శర్మ చెరో రెండు వికెట్లు, మాక్స్‌వెల్‌, సిరాజ్‌లు ఒక్కొ వికెట్ తీశారు.

అంత‌క‌ముందు టాస్ గెలిచి మొద‌ట బ్యాటింగ్ చేసిన‌ బెంగ‌ళూరు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 171 ప‌రుగులు చేసింది. కెప్టెన్ పాప్ డుప్లెసిస్‌(55; 44 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సులు), గ్లెన్ మాక్స్‌వెల్‌(54; 33 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స‌ర్లు) అర్ధ‌శ‌త‌కాల‌తో రాణించ‌గా ఆఖ‌ర్లో అనుజ్ రావత్(29 నాటౌట్; 11 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌) మెరుపులు మెరిపించాడు. విరాట్ కోహ్లి(18), మ‌హిపాల్ లోమ్రోర్‌(1), దినేశ్ కార్తిక్‌(0)లు విఫ‌లం అయ్యారు. రాజ‌స్థాన్ బౌల‌ర్ల‌లో కేఎం ఆసిఫ్‌, ఆడ‌మ్ జంపా చెరో రెండు వికెట్లు తీయ‌గా, సందీప్ శ‌ర్మ ఓ వికెట్ ప‌డ‌గొట్టాడు.

IPL: మరో 10 లీగ్ మ్యాచులే మిగిలాయి.. ఫైనల్ రేసులో ఉన్న జట్లు ఏవి? ఆరెంజ్ క్యాప్ సంగతేంటీ?