వెక్కివెక్కి ఏడ్చిన టెండూల్కర్: గురువు పాడె మోసిన సచిన్
క్రికెట్ లెజండ్, భారతరత్న, క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ వెక్కివెక్కి ఏడ్చారు. ఆయన్ను ఓదార్చటం ఎవ్వరి తరం కాలేదు. చాలా మంది ఆయన్ను సముదాయించినా ఫలితం లేదు. తనను క్రికెట్ గాడ్ గా తీర్చిదిద్దిన కోచ్ రమాకాంత్ అచ్రేకర్ భౌతికకాయాన్ని చూసి బోరుమన్నారు.

క్రికెట్ లెజండ్, భారతరత్న, క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ వెక్కివెక్కి ఏడ్చారు. ఆయన్ను ఓదార్చటం ఎవ్వరి తరం కాలేదు. చాలా మంది ఆయన్ను సముదాయించినా ఫలితం లేదు. తనను క్రికెట్ గాడ్ గా తీర్చిదిద్దిన కోచ్ రమాకాంత్ అచ్రేకర్ భౌతికకాయాన్ని చూసి బోరుమన్నారు.
క్రికెట్ లెజండ్, భారతరత్న, క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ వెక్కివెక్కి ఏడ్చారు. ఆయన్ను ఓదార్చటం ఎవ్వరి తరం కాలేదు. చాలా మంది ఆయన్ను సముదాయించినా ఫలితం లేదు. తనను క్రికెట్ గాడ్ గా తీర్చిదిద్దిన కోచ్ రమాకాంత్ అచ్రేకర్ భౌతికకాయాన్ని చూసి బోరుమన్నారు. చిన్ననాటి జ్ణాపకాలను, క్రికెట్ లో ఓనమాలు దిద్దిన విషయాలను గుర్తు చేసుకుని మరీ ఏడ్చేశారు. బ్యాట్ పట్టించిన చేతులు ఇక లేవని.. తన వెంట పరిగెట్టిన కాళ్లు ఎక్కడని.. ప్రపంచస్థాయి క్రీడాకారుడిగా తీర్చిదిద్దిన వ్యక్తి ఇక లేరన్న విషయాన్ని తలచుకుని మరీ విలపించారు సచిన్.
జనవరి 3వ తేదీ గురువారం ముంబైలో గురువు అచ్రేకర్ అంత్యక్రియల్లో సచిన్ పాల్గొన్నారు. పార్థీవ దేహాన్ని టెండూల్కర్ స్వయంగా మోశారు. క్రికెట్ కోచ్‌గా ఎన్నో సేవలు అందించిన రమాకాంత్ మరణానంతరం ఆయన పార్థీవదేహాన్ని సందర్శనార్థం శివాజీ పార్క్ లో ఉంచారు. రామాకాంత్ శిక్షణ తీసుకున్న క్రికెట్లరందరూ ఆయన అంత్యక్రియల్లో పాల్గొని అమర్ రహే అనే నినాదాలతో కన్నీటి వీడ్కోలు పలికారు. సచిన్ తో పాటు కోట్లాది మంది క్రికెటర్లకు రమాకాంత్ క్రికెట్ లో శిక్షణ ఇచ్చాడు. ఫౌండేషన్ ఐ స్టాండ్ ఆన్ అనే సంస్థను స్థాపించాడు. ఎంతోమంది క్రికెటర్ల భవిష్యత్తుకు బాటలు వేశారు.
అచ్రేకర్ అంత్యక్రియల్లో వినోద్ కాంబ్లీ, వినోద్కర్, వినోద్ కాంబ్లీ, బల్విందర్ సింగ్ సంధూ, చంద్రకాంత్ పండిట్, రాజకీయ నాయకుల్లో మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధినేత రాజ్ థాకరే, ఎమ్మెల్యే ఆశిష్ షెల్లా, మేయర్ విశ్వనాథ్ మహాదేశ్వర్ శ్మశానవాటిక వరకు ఊరేగింపులో పాల్గొన్నారు.