Samantha: విరాట్ కోహ్లి శ‌త‌కం చేయ‌గానే ఏడుపు ఆగ‌లేదు.. అత‌డే నాకు స్పూర్తి

విరాట్ జీవితం నుంచి తాను స్పూర్తి పొందాన‌ని చెబుతోంది హీరోయిన్ స‌మంత‌. విరాట్ కోహ్లి అంత‌ర్జాతీయ క్రికెట్‌లో 71వ సెంచ‌రీ సాధించిన‌ప్పుడు ఏడ్చాన‌ని చెప్పింది.

Samantha: విరాట్ కోహ్లి శ‌త‌కం చేయ‌గానే ఏడుపు ఆగ‌లేదు.. అత‌డే నాకు స్పూర్తి

Samantha-Virat Kohli

Samantha-Virat Kohli: భార‌త మాజీ కెప్టెన్‌, ర‌న్ మెషీన్ విరాట్ కోహ్లి(Virat Kohli) గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. అత‌డి ఆట మాత్ర‌మే కాదు వ్య‌క్తిగ‌త జీవితం ఎంతో మందికి ఆద‌ర్శం. ఫిట్‌నెస్‌ను కాపాడుకోవ‌డం, ఇత‌ర విష‌యాలు కానివ్వండి కోహ్లిని స్పూర్తిగా తీసుకునే యువ ఆట‌గాళ్లు ఎంద‌రో. విరాట్ జీవితం నుంచి తాను స్పూర్తి పొందాన‌ని చెబుతోంది హీరోయిన్ స‌మంత‌(Samantha).

హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో క‌లిసి స‌మంత స్టార్ స్పోర్ట్స్‌కు ఓ ఇంట‌ర్వ్యూ ఇచ్చింది. ఇందులో ప‌లు విష‌యాల‌ను షేర్ చేసుకుంది. ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(IPL)లో త‌న‌కు ఇష్ట‌మైన జ‌ట్టు చెన్నై సూప‌ర్ కింగ్స్ అని, త‌న ఫేవ‌రెట్ ఆట‌గాడు మ‌హేంద్ర సింగ్ ధోని చెప్పుకొచ్చింది. అలాగే భార‌త మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి త‌న‌కు స్పూర్తి అని తెలిపింది.

Virat Kohli: జైస్వాల్‌ను ప్ర‌శంసిస్తూ కోహ్లి పోస్ట్‌.. కాసేప‌టికే డిలీట్‌.. అస‌లు సంగ‌తి ఇదే..?

విరాట్ కోహ్లి అంత‌ర్జాతీయ క్రికెట్‌లో 71వ సెంచ‌రీ సాధించిన‌ప్పుడు ఏడ్చాన‌ని చెప్పింది. ఆ స‌మ‌యంలో కోహ్లి ఫామ్‌లో లేడు. దాదాపు మూడేళ్లుగా ఒక్క శ‌త‌కం కూడా సాధించ‌లేదు. అత‌డు అందించిన విజ‌యాలు మ‌రిచిపోయి చాలా మంది అత‌డిని విమ‌ర్శించారు. ముప్పేట దాడిని ఎదుర్కొంటూ విరాట్ పుంజుకున్న తీరు అద్భుతం అని, ఇది ఎంద‌రికో స్పూర్తి దాయకం అని స‌మంత అంది. త‌న‌ను విమ‌ర్శించిన వాళ్ల‌కు ఎలా బుద్ది చెప్పాలో త‌న‌కు అర్ధ‌మైన‌ట్లు స‌మంత చెప్పుకొచ్చింది. ఇంకా ఎన్నో విష‌యాల‌ను షేర్ చేసుకుంది.

న‌టి స‌మంత కూడా త‌న జీవితంలో ఎన్ని క‌ష్టాలు అనుభ‌వించింది. పెళ్లి, కెరీర్‌లో వివాదాలు, హెల్త్ ఇష్యూస్‌, ట్రోల్స్ ఇలా ఎన్నింటినో ఆమె ఎదుర్కొంది. నాగ చైత‌న్య‌తో విడాకులు తీసుకున్న అనంత‌రం ప్ర‌స్తుతం సినిమాల‌పై పూర్తిగా దృష్టి సారించింది. ప్రస్తుతం ఆమె విజ‌య్‌దేవ‌ర‌కొండ‌తో క‌లిసి ‘ఖుషీ’ చిత్రంలో న‌టిస్తోంది. శివ నిర్వాణ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తున్నారు. భారీ అంచ‌నాలు ఉన్న ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా సెప్టెంబ‌ర్ 1న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Virat Kohli: చ‌రిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. ఐపీఎల్‌లో ఒకే ఒక్క‌డు

ఇదిలా ఉంటే.. ఐపీఎల్ 2023లో విరాట్ కోహ్లి, మ‌హేంద్ర సింగ్ ధోనిలు బిజీగా ఉన్నారు. విరాట్ రాయ‌ల్స్ ఛాలెంజర్స్ బెంగ‌ళూరుకు ఆడుతుండ‌గా, ధోని చెన్నై సూప‌ర్ కింగ్స్‌కు నాయ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. చెన్నై 12 మ్యాచుల్లో ఏడు విజ‌యాలు సాధించి ప్లే ఆఫ్స్ బెర్తును దాదాపుగా ఖాయం చేసుకుంది. ఆర్‌సీబీ 11 మ్యాచుల్లో 5 విజ‌యాలు సాధించింది. మిగిలిన మూడు మ్యాచుల్లో గెలిస్తేనే ఆర్‌సీబీ ప్లే ఆఫ్స్‌కు వెళ్ల‌నుంది.