Sania Mirza: టెన్నిస్‌కు వీడ్కోలు పలికిన సానియా మీర్జా .. చివరి టోర్నీలో ఓటమి.. సానియా ట్రాక్‌ రికార్డ్‌ ఇలా..

భారత టెన్నిస్ ఐకాన్ సానియా మీర్జా తన 20ఏళ్ల అద్భుతమైన కెరీర్‌ను ముగించింది. మంగళవారం దుబాయ్‌లో జరిగిన డ్యూటీ ఫ్రీ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌లో తొలి రౌండ్‌లో ఓటమితో తన కెరీర్ కు వీడ్కోలు పలికింది.

Sania Mirza: టెన్నిస్‌కు వీడ్కోలు పలికిన సానియా మీర్జా .. చివరి టోర్నీలో ఓటమి.. సానియా ట్రాక్‌ రికార్డ్‌ ఇలా..

Sania Mirza

Sania Mirza: భారత టెన్నిస్ ఐకాన్ సానియా మీర్జా తన 20ఏళ్ల అద్భుతమైన కెరీర్‌ను ముగించింది. మంగళవారం దుబాయ్‌లో జరిగిన డ్యూటీ ఫ్రీ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌లో తొలి రౌండ్‌లో ఓటమితో తన కెరీర్ కు వీడ్కోలు పలికింది. తన చివరి గ్రాండ్ స్లామ్ ఆస్ట్రేలియా ఓపెన్‌లో టైటిల్‌కు చేరువగా వెళ్లి ఫైనల్లో ఓడిన సానియా.. కెరీర్ చివరి టోర్నీలో మాత్రం అభిమానులను నిరాశ పర్చింది. అమెరికా క్రీడాకారిణి మాడిసన్ కీస్‌తో కలిసి బరిలోకి దిగిన సానియా.. తొలి రౌండ్లోనే ఓటమి పాలైంది. తన కెరీర్లో ఇదే చివరి టోర్నీఅని సానియా గతంలోనే ప్రకటించిన విషయం విధితమే. దీంతో చివరిగా మైదానంలో సానియా ఆటను చూసేందుకు ఆమె అభిమానులు అమితాసక్తిని ప్రదర్శించారు. గంటలోనే ఆట ముగియడం, సానియా ఓడిపోవటంతో అభిమానులు నిరాశ చెందారు.

Indian tennis star Sania Mirza

Indian tennis star Sania Mirza

Sania Mirza: చివరి గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్లో ఓటమి.. కన్నీళ్లు పెట్టుకున్న సానియా మీర్జా.. వీడియో వైరల్

మహిళల డబుల్స్ మొదటి రౌండ్ లో సానియా మీర్జా, అమెరికా క్రీడాకారిణి మాడిసన్ కీస్ ద్వయం 4-6, 0-6తో వెరోనికా – లుడామిలా (రష్యా) జంట చేతిలో ఓటమి పాలైంది. తొలి సెట్ లో ఒక దశలో 4-4తో చక్కటి ప్రదర్శన కనబర్చిన సానియా జోడీ ఆ తరువాత జోరు కొనసాగించలేక పోయింది. 36ఏళ్ల సానియా మీర్జా తన 20ఏళ్ల కెరీర్లో ఆసియా గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్, ఆఫ్రో‌ఆసియా గేమ్స్ ఇలా అన్నింట్లోనూ మెడల్స్ సాధించింది. ఈ ఏడాది ఆస్ట్రేలియా ఓపెన్ మిక్డ్స్ డబుల్స్ రన్నరప్‌గా నిలిచిన సానియా మీర్జా.. తొలిసారి గ్రాండ్ స్లామ్ టైటిల్ నెగ్గిన మెల్ బోర్నలోనే గ్రాండ్ స్లామ్ కెరీర్ కు పుల్‌స్టాప్ పెట్టిన విషయం విధితమే. తాజాగా పరాజయంతో ప్రొఫెషనల్ టెన్నిస్‌కు సానియా దూరమైంది.

Indian tennis star Sania Mirza

Indian tennis star Sania Mirza

Sania Mirza Retirement: తన రిటైర్మెంట్‌పై క్లారిటీ ఇచ్చిన సానియా మీర్జా.. ఆమె ఆడే చివరి మ్యాచ్ అదేనట..

సానియా మీర్జా ట్రాక్‌ రికార్డ్‌ ..

♦  1986 నవంబర్ 15న జన్మించిన సానియా మీర్జా.. 2003లో ప్రొఫెషనల్ కెరీర్‌ను ప్రారంభించింది.

♦  సానియా మీర్జా నాలుగు ఒలింపిక్స్ (2008, 2012, 2016, 2020) లో పోటీపడింది. బోపన్నతో కలిసి 2016లో కాంస్య పతక పోరుకు అర్హత సాధించడం ఒలింపిక్స్‌లో సోనియా అత్యుత్తమ ప్రదర్శన.

♦  రెండు దశాబ్దాల కెరీర్‌లో సానియా ఆరు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్, 43 కెరీర్ డబుల్స్ టైటిల్స్ సాధించింది.

♦  డబుల్స్ లో మాజీ ప్రపంచ నవంబర్ వన్. ఈ ఘనత సాధించిన తొలి భారత ప్లేయర్ సానియా.

Sania Mirza

Sania Mirza

♦  డబ్ల్యూటీఏ టైటిల్ గెలిచిన తొలి భారత ప్లేయర్. గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలిచిన తొలి భారత క్రీడాకారిణిగా సానియా ఘత సాధించింది.

♦  సింగిల్స్ అత్యుత్తమ ర్యాంకు 27 (2007 ఆగస్టు). డబుల్స్ అత్యుత్తమ ర్యాంక్ 1 (2015 ఏప్రిల్).

♦  కెరీర్‌లో సానియా ఆరు గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు గెలిచింది. ఇందులో మూడు డబుల్స్, మూడు మిక్స్‌డ్ టైటిళ్లు ఉన్నాయి.

♦  ఆస్ట్రేలియా ఓపెన్ (2016), వింబుల్డన్ (2015), యూఎస్ ఓపెన్ (2015)లలో గ్రాండ్ స్లామ్ డబుల్స్ టైటిల్స్ సాధించింది.

Indian tennis star Sania Mirza

Indian tennis star Sania Mirza

♦  ఆస్ట్రేలియా ఓపెన్ (2009), ఫ్రెంచ్ ఓపెన్ (2012), యూఎస్ ఓపెన్ (2014)లలో గ్రాండ్‌స్లామ్ మిక్స్‌డ్ డబుల్ టైటిల్స్ సాధించింది.

♦  గ్రాండ్‌స్లామ్ డబుల్స్‌లో ఆరు టైటిల్స్ నెగ్గిన సానియా మీర్జా 91 వారాల పాటు ఏకధాటిగా మహిళల డబుల్స్‌లో ప్రపంచ నెంబర్ వన్‌గా కొనసాగింది.

♦  భారత ప్రభుత్వం తరపున అర్జున అవార్డు (2004), పద్మ శ్రీ (2006), ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న (2015), పద్మ భూషణ్ (2016) అందుకుంది.

♦  2014 సంవత్సరంలో తెలంగాణ ప్రభుత్వం సానియా మీర్జా‌ను రాష్ట్ర అంబాసిడర్‌గా నియమించింది.