Sania Mirza: ఒలింపిక్స్‌లోకి 4సార్లు అర్హత సాధించిన భారత మహిళ సానియా మీర్జా

సానియా మీర్జా నాలుగోసారి ఒలింపిక్ గేమ్స్ లోకి అర్హత సాధించింది. ఈ ఫీట్ సాధించిన రెండో ఇండియన్ మహిళగా ఘనత దక్కించుకుంది. ఇంతకంటే ముందు షైనీ విల్సన్ నాలుగు సార్లు ఒలింపిక్ లో పాల్గొన్నారు.

Sania Mirza: ఒలింపిక్స్‌లోకి 4సార్లు అర్హత సాధించిన భారత మహిళ సానియా మీర్జా

Sania Mirza

Sania Mirza: సానియా మీర్జా నాలుగోసారి ఒలింపిక్ గేమ్స్ లోకి అర్హత సాధించింది. ఈ ఫీట్ సాధించిన రెండో ఇండియన్ మహిళగా ఘనత దక్కించుకుంది. ఇంతకంటే ముందు షైనీ విల్సన్ నాలుగు సార్లు ఒలింపిక్ లో పాల్గొన్నారు. టోక్యో ఒలింపిక్ గేమ్స్ లో తన పార్టనర్ అంకిత రైనాను ఎంచుకున్న సందర్భంగా ఇంగ్లీష్ మీడియా ఆమెను ఇంటర్వ్యూ చేసింది.

అంకితా దేశంలో ప్రస్తుతం బెస్ట్ ప్లేయర్ గా కనిపించారు. అందుకే ఆమెను ఎంచుకున్నా. చాలా కాలం నుంచి అంకితా నాకు తెలుసు. అంకిత బ్యాక్ హ్యాండ్ సైడ్ ఆడితే నేను ఫోర్ హ్యాండ్ సైడ్ ఆడతా. గేమ్ ఆడటానికి ముందు మేం ఫేవరేట్ గా కనిపించకపోవచ్చు. కానీ, ఏదైనా జరిగే అవకాశం ఉంది కదా.

ఈ సారి ఒలింపిక్ టోర్నీలో గుర్తుండిపోయే ప్రదర్శన చేయాలనుకుంటున్నా. ఇది నాకు చాలా స్పెషల్. వింబుల్డన్ కు.. ఒలింపిక్ కు పది రోజుల గ్యాప్ ఉంది. అది కూడా తక్కువేం కాదు. ఒలింపిక్ ఆడేందుకు ఇంకా 91వారాల సమయం ఉంది. ప్రిపరేషన్ కు అది సరిపోతుంది’ అని తల్లిగా తొలి సారి మెగా టోర్నీలో అడుగుపెడుతున్న సానియా అన్నారు.