Sania Mirza: ఒలింపిక్ కిట్ దక్కించుకున్న సంతోషంలో సానియా మీర్జా డ్యాన్స్

మెగా క్రీడా ఈవెంట్ ఒలింపిక్ గేమ్స్‌కు సానియా కొద్ది నెలల క్రితమే అర్హత సాధించినా.. రీసెంట్ గా ఒలింపిక్ కిట్ అందుకుని సంతోషంలో మునిగిపోయారు.

Sania Mirza: ఒలింపిక్ కిట్ దక్కించుకున్న సంతోషంలో సానియా మీర్జా డ్యాన్స్

Sania Mirza (1)

Sania Mirza: మెగా క్రీడా ఈవెంట్ ఒలింపిక్ గేమ్స్‌కు సానియా కొద్ది నెలల క్రితమే అర్హత సాధించినా.. రీసెంట్ గా ఒలింపిక్ కిట్ అందుకుని సంతోషంలో మునిగిపోయారు. జులై 23న జరగనున్న టోక్యో ఒలింపిక్స్ కోసం రెడీ అవుతున్న వీడియో సోషల్ నెట్‌వర్కింగ్ లో పోస్టు చేయడంతో వైరల్ అయింది. అమెరికన్ ర్యాపర్ డోజా క్యాట్స్ లేటెస్ట్ సాంగ్ కిస్ మీ మోర్ సాంగ్ వినిపిస్తుండగా చిన్నపాటి మూమెంట్స్ తో సానియా చిందులేశారు.

నా పేరులో ఉండే ‘A’ నాకు జీవితంలో ఎంతో విలువైనది. అని దానిపై క్యాప్షన్ రాసి పోస్టు చేశారు. ‘A’ అంటే Aggression, Ambition, Achieve, Affection అంటూ వివరించారు. ఈ పోస్టుకు రెండు గంటల్లోనే 55వేల లైకులు దక్కించుకోంది. పోస్టుకు రెస్పాండ్ అయిన కుమార్ మంగళం బిర్లా కూతురు అనన్యా బిర్లా.. ‘నీ డ్యాన్స్ మూవ్స్ అంటే ఇష్టం. కంగ్రాట్స్’ అంటూ రాసుకొచ్చారు.

View this post on Instagram

A post shared by Sania Mirza (@mirzasaniar)

నెటిజన్లు ఆల్ ద బెస్ట్ చెప్తూ.. పేరులోని ‘A’ను పొగిడేస్తూ కామెంట్ చేస్తున్నారు. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ 2020 టోక్యో గేమ్స్ కు సంబంధించిన ఈ ఒలింపిక్ కిట్ ను విడుదల చేసింది.

మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీతో జరిగిన వీడియో కాన్ఫిరెన్స్ లో సానియా మీర్జా పాల్గొన్నారు. రాబోయే ఈవెంట్ గురించి తన ప్రిపరేషన్ ను ప్రధానికి వివరించారు. ఈ సమావేశంలో ఏళ్ల తరబడి ఇండియన్ స్టార్ కనబరుస్తున్న ప్రదర్శనకు ప్రధాని పొగిడేశారు.

దానికి రెస్పాన్స్ ఇచ్చిన సానియా.. ఇప్పుడు చిన్న పిల్లలు కూడా టెన్నిస్ లో పెద్ద ప్లేయర్లు అవగలరనే నమ్మకంతో ఉన్నారు. వాళ్లు హర్డ్ వర్క్ చేయాలి, సపోర్ట్ తో పాటు డెడికేషన్ చాలా ముఖ్యం. డెస్టినీ అనేది కీలక పాత్ర పోషించినా హార్డ్ వర్క్, టాలెంట్ లేకుంటే ఏం చేయలేం’ అని ప్రస్తావించారు.