WTC Final: టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు 11మంది టీమ్ ఇదేనా?

ఇంటర్నేషనల్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ జూన్ 18 నుంచి జరగనుండగా.. ఎవరు ఫైనల్ ఎలెవన్‌లో ఉంటారు అనేదానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఈ క్రమంలోనే మాజీ భారత బ్యాట్స్‌మన్ సంజయ్ మంజ్రేకర్ ప్లేయింగ్ ఎలెవన్‌ ఇలా ఉండచ్చునని ప్రకటించారు.

WTC Final: టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు 11మంది టీమ్ ఇదేనా?

Test Champ

India’s probable XI: ఇంటర్నేషనల్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ జూన్ 18 నుంచి జరగనుండగా.. ఎవరు ఫైనల్ ఎలెవన్‌లో ఉంటారు అనేదానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఈ క్రమంలోనే మాజీ భారత బ్యాట్స్‌మన్ సంజయ్ మంజ్రేకర్ ప్లేయింగ్ ఎలెవన్‌ ఇలా ఉండచ్చునని ప్రకటించారు. లోకల్ పిచ్‌ల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని మంజ్రేకర్ ఈ జట్టును ఎంచుకున్నాడు. స్పిన్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా మరియు ఫాస్ట్ బౌలర్ ఇశాంత్ శర్మలకు జట్టులో చోటు ఇవ్వలేదు. ఇటీవల ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్ చాలా మంచి ప్రదర్శన ఇస్తుండగా.. సిరాజ్‌ను జట్టులో అవకాశం ఇచ్చారు.

ESPN Cricinfoతో మాట్లాడుతూ, ” యూకేలోని సౌతాంప్టన్‌లో పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని, టెస్ట్ మ్యాచ్‌ జరిగే మొత్తం ఐదు రోజులు ఎండ మరియు మేఘావృతమై ఉంటుందని ఊహిస్తున్నాను”. ఈ క్రమంలో పటిష్టమైన జట్టును ఎంచుకోవల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. మంజ్రేకర్ తన జట్టులో హనుమా విహారీకి అవకాశం ఇచ్చాడు. ఆస్ట్రేలియాలో గాయపడటానికి ముందు విహారి కొన్ని అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడానని గుర్తుచేశాడు. అద్భుతమైన డిఫెన్సివ్ టెక్నిక్ ఉన్న లోయర్ ఆర్డర్‌లో భారత్‌కు బ్యాట్స్‌మన్ అవసరం. టాప్ ఆర్డర్‌లో పుజారా తప్ప, మరెవరికీ ఈ గుణం లేదు.

అటువంటి పరిస్థితిలో, నేను హనుమవిహారీని ఆరవ స్థానంలో, రిషబ్ పంత్‌ను ఏడవ స్థానంలో ఉంచాలని అన్నారు. టీమ్ ఇండియా ఎలాంటి ప్రాక్టీస్ మ్యాచ్ కూడా ఆడలేదు కాబట్టి, బ్యాటింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని అన్నారు. సిరాజ్‌కు జట్టులో చోటు ఇవ్వడంపై మంజ్రేకర్ మాట్లాడుతూ, “ఆస్ట్రేలియా చివరి పర్యటనలో సిరాజ్ అద్భుతంగా ఆడాడు. ఐదు వికెట్లు పడగొట్టాడు. అందుకే స్వింగ్ బౌలర్ సిరాజ్‌ను జట్టులో ఉంచాలని అనుకుంటున్నాను.” అని చెప్పారు. షమీ, బుమ్రా, ఇషాంత్ ఒక విధమైన బౌలర్లు.. సిరాజ్ వేరని అన్నారు. కొన్ని కారణాల వల్ల ఈసారి భారత్‌ ఇషాంత్‌కు అవకాశం ఇవ్వవచ్చు అని అభిప్రాయపడ్డారు మంజ్రేకర్.

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు మంజ్రేకర్ సెలక్ట్ చేసిన ఎలెవన్:
రోహిత్ శర్మ, శుబ్మాన్ గిల్, చేతేశ్వర్ పూజారా, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానె, హనుమ విహారీ, రిషబ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్, షమీ, జస్‌ప్రీత్ బుమ్రా, సిరాజ్.