Rohit sharma: టాస్ వేశాక మీరే చూడండి.. ప్రస్తుతానికి ఆ విషయం రహస్యం.. విలేకరులతో రోహిత్ శర్మ.. ఆ రహస్య విషయం ఏమిటంటే?

ఆసియా కప్ టోర్నీలో భాగంగా మరికొద్ది సేపట్లో భారత్ వర్సెస్ పాకిస్థాన్ మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్ లో భారత్ జట్టునుంచి ఓపెన్ గా రోహిత్ తో ఎవరు వస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఇదే విషయాన్ని పలువురు విలేకరులు రోహిత్ శర్మను ప్రశ్నించగా.. రోహిత్ సెటైరికల్ వ్యాఖ్యలతో నవ్వులు పూయించాడు.

Rohit sharma: టాస్ వేశాక మీరే చూడండి.. ప్రస్తుతానికి ఆ విషయం రహస్యం.. విలేకరులతో రోహిత్ శర్మ.. ఆ రహస్య విషయం ఏమిటంటే?

Rohit sharma

Rohit sharma: మరికొద్ది సేపట్లో భారత్ వర్సెస్ పాకిస్థాన్ మధ్య టీ20 మ్యాచ్ ప్రారంభం కానుంది. ఆసియా కప్ టోర్నీలో భాగంగా దుబాయ్ లో భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30కు గంటల ప్రారంభమయ్యే మ్యాచ్ కోసం ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ లవర్స్ ఆసక్తిగా ఎదరుచూస్తున్నారు. అయితే భారత్ జట్టులో అందరి దృష్టి కోహ్లీపైనే ఉంది. కొంతకాలంగా కోహ్లీ ఫామ్ కోల్పోయి పరుగులు రాబట్టేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో పాక్ తో జరిగే మ్యాచ్ లో కోహ్లీ ఏ విధంగా తన ఆటతీరును ప్రదర్శిస్తారన్న దానిపై సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతోంది.

India-Pakistan Match: బయటకు రావద్దు.. భారత్-పాక్ మ్యాచ్‌ను గుంపులుగా చూశారో.. విద్యార్థులకు వార్నింగ్ ఇచ్చిన కాలేజ్

మరోవైపు భారత్ ఓపెనింగ్ బ్యాట్స్ మెన్ పై ఉత్కంఠ కొనసాగుతోంది. కెప్టెన్ రోహిత్ శర్మ ఓపెనింగ్ బ్యాట్స్ మెన్ గా రానున్నాడు.. అయితే ఆయనకు తోడు ఓపెనింగ్ బ్యాటర్ గా ఎవరొస్తారనేది ఆసక్తికంగా మారింది. ప్రస్తుతం జట్టులో రాహుల్, పంత్, సూర్యకుమార్ యాదవ్ లు ఉన్నారు. వీరు ముగ్గురు మునుపు ఓపెనర్స్ గా క్రిజ్ లోకి వచ్చిన వారే. సాయంత్రం జరిగే మ్యాచ్ లో రోహిత్ తన వెంట ఓపెనింగ్ బ్యాటర్ గా ఈ ముగ్గురు ఆటగాళ్లలో ఎవరికి అవకాశం ఇస్తారన్న ప్రశ్న క్రికెట్ అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది. ఇదే విషయాన్ని విలేకరులు రోహిత్ శర్మ వద్ద ప్రస్తావించారు.

Ind Vs Pak Match: హైవోల్టేజ్ మ్యాచ్.. నేడు దాయాది జట్ల మధ్య సమరం.. వారు రాణిస్తే భారత్ విజయం నల్లేరుపై నడకే..

రోహిత్ శర్మ విలేకరుల సమావేశంలో మాట్లాడుతుండగా పలువురు విలేకరులు భారత్ జట్టు నుంచి ఓపెనింగ్ బ్యాట్స్ మెన్ గా ఎవరు వస్తారని ప్రశ్నించారు. దీంతో రోహిత్ విలేకరులపై పంచులు విసురుతూ నవ్వులు పూయించాడు. ఓపెనింగ్ బ్యాట్స్ మెన్ ఎవరు క్రిజ్ లోకి వస్తారనేది మ్యాచ్ వ్యూహాన్ని బట్టి ఉంటుందని, ఆ విషయాలు బయటకు వెల్లడించేవి కాదంటూ రోహిత్ అన్నాడు. మళ్లీ పాకిస్థాన్ విలేకరి ఇదే విషయాన్ని ప్రస్తావించడంతో.. ఆదివారం జరిగే మ్యాచ్ లో టాస్ వేశాక మీరే చూడండి.. ఎవరు వస్తారో.. మమ్మల్ని కూడా కొన్ని రహస్యాలు దాచుకోనివ్వండి బ్రదర్ అంటూ రోహిత్ నవ్వులు పూయించాడు. అంతేకాదు మేం కొత్తవి ప్రయత్నించాలని నిర్ణయించుకున్నాం. వాటిల్లో కొన్ని పనిచేస్తే మరికొన్ని ఫలితాన్ని ఇవ్వవు, ప్రయత్నించడంలో తప్పులేదు.. అవకాశం వచ్చినప్పుడల్లా కొత్తవి ప్రయత్నిస్తాం అంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చాడు.