Asia Cup-2023: ఇది యుద్ధాలు చేసుకునే తరం కాదు.. పాక్ కు టీమిండియా రావాలి: షాహిద్ అఫ్రిదీ

పాక్ కు టీమిండియా వచ్చి క్రికెట్ ఆడాలని షాహిద్ అఫ్రిదీ కోరుకుంటున్నారు. క్రికెట్ వల్ల ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు మెరుగుపడతాయని భావిస్తున్నారు. చివరిసారిగా, ఆసియా కప్-2008లో ఆడడానికి పాక్ కు టీమిండియా వెళ్లింది.

Asia Cup-2023: ఆసియా కప్-2023 (Asia Cup -2023) ఆడడానికి పాకిస్థాన్ కు టీమిండియా రావాలని పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిదీ (Shahid Afridi) అన్నారు. దీంతో, భారత్-పాక్ ధ్వైపాక్షిక సంబంధాలు బలపడడానికి మొదటి అడుగు వేయాలని చెప్పారు. ఈ ఏడాది ఆసియా కప్ మ్యాచులు పాకిస్థాన్ లో జరగాల్సి ఉన్న నేపథ్యంలో ఆ దేశానికి టీమిండియా వెళ్తుందా? అన్న విషయంపై ఇప్పటికే బీసీసీఐ కార్యదర్శి జై షా స్పందించారు.

ఈ టోర్నమెంట్ కోసం పాక్ కు భారత్ వెళ్లదని గతంలోనే స్పష్టం చేశారు. ఆసియా కప్-2023(Asia Cup -2023)పై తాజాగా షాహిద్ అఫ్రిదీ స్పందించారు. దోహాలో జరుగుతున్న లెజెండ్స్ లీగ్ క్రికెట్ (LLC) సందర్భంగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… భారత్ తమ దేశానికి వస్తే బాగుంటుందని అన్నారు. ఇది యుద్ధాలు, పోరాటాలు చేసుకునే తరం కాదని చెప్పారు.

సత్సంబంధాలు మెరుగుపడాలని తాము కోరుకుంటున్నట్లు షాహిద్ అఫ్రిదీ తెలిపారు. క్రికెటే ఉత్తమ దౌత్యంగా పనిచేస్తుందని చెప్పారు. ఇరు జట్లు పరస్పరం సహకారం అందించుకోవాలని కోరారు. ఆసియా కప్-2008లో ఆడడానికి పాక్ కు టీమిండియా వెళ్లింది. ఇరు జట్ల మధ్య పాక్ లో ద్వైపాక్షిక సిరీస్ 2006లో జరిగింది. టీ20 ప్రపంచ కప్-2016లో ఆడడానికి చివరిసారి భారత్ కు పాకిస్థాన్ వచ్చింది.

Steve Smith: అద్భుతంగా క్యాచ్ పట్టిన స్మిత్.. ‘క్యాచ్ ఆఫ్ ద సెంచరీ’ అంటున్న జహీర్ ఖాన్… వీడియో ఇదిగో!

ట్రెండింగ్ వార్తలు