Shardul Thakur: గర్ల్ ఫ్రెండ్‌తో శార్దూల్ ఠాకూర్ ఎంగేజ్మెంట్

టీమిండియా ఫేసర్ శార్దూల్ ఠాకూర్ సుదీర్ఘ కాలంగా రిలేషన్ లో ఉన్న గర్ల్ ఫ్రెండ్ తోనే ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేసుకున్నాడు. మిట్టలీ పారుల్కర్ తో ముంబై క్రికెట్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన...

10TV Telugu News

Shardul Thakur: టీమిండియా ఫేసర్ శార్దూల్ ఠాకూర్ సుదీర్ఘ కాలంగా రిలేషన్ లో ఉన్న గర్ల్ ఫ్రెండ్ తోనే ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేసుకున్నాడు. మిట్టలీ పారుల్కర్ తో ముంబై క్రికెట్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన ఫంక్షన్ లో ఎంగేజ్మెంట్ జరిగింది. కార్యక్రమానికి కేవలం 75మంది అతిథులు మాత్రమే రావడం గమనార్హం.

ఇరు కుటుంబాలకు అతి సమీప బంధువులను మాత్రమే ఆహ్వానించారు. టీ20 వరల్డ్ కప్ 2022 తర్వాతే వీరి వివాహం ఉంటుందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

‘ముంబై క్రికెట్ అసోసియేషన్ ఫెసిలిటీలో సోమవారం చిన్న ఎంగేజ్మెంట్ ఫంక్షన్ జరిగింది. సన్నిహిత మిత్రులు, దగ్గరి బంధువులను మాత్రమే ఆహ్వానించారు. ఆస్ట్రలియాలో జరిగే టీ20 వరల్డ్ కప్ తర్వాత పెళ్లి జరుగుతుంది’ అని ఇంగ్లీష్ మీడియా తెలిపింది.

…………………………………. : ప్రభుత్వ ఆస్పత్రిలో రోగి ఇడ్లీ పార్సిల్‌లో కప్ప కళేబరం..

చివరిగా 2021 టీ20వరల్డ్ కప్ లో రెండు మ్యాచ్ లు ఆడాడు శార్దూల్ ఠాకూర్. ప్రస్తుతం న్యూజిలాండ్ తో జరిగే మ్యాచ్ లకు బీసీసీఐ అతనికి విశ్రాంతి ఇచ్చింది. అతని కెరీర్ లో 4టెస్టులు, 15వన్డేలు, 23టీ20లు ఆడాడు. ఐపీఎల్ లో 61మ్యాచ్ లు ఆడి 67వికెట్లు పడగొట్టాడు.

×