Shikhar Dhawan : ధావన్ నోట పుష్ప డైలాగ్.. తగ్గేదే లే.. కేక పుట్టించాడుగా..!
ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప మూవీకి ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ పెరిగిపోయింది. పుష్పలో బన్నీ చెప్పే డైలాగ్.. తగ్గేదేలే.. ఇప్పుడిదే ట్రెండ్ నడుస్తోంది.

Shikhar Dhawan Acting Viral Video : ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప మూవీకి ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ పెరిగిపోయింది. పుష్పలో బన్నీ చెప్పే డైలాగ్.. తగ్గేదేలే.. ఇప్పుడిదే ట్రెండ్ నడుస్తోంది. ప్రతిఒక్కరూ ఇదే డైలాగ్‌తో సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. సినీప్రముఖులతో పాటు క్రికెటర్లు కూడా పుష్ప పాపులర్ డైలాగ్ కు ఫిదా అయిపోతున్నారు. భారత క్రికెట్ జట్టు బ్యాట్స్ మెన్ శిఖర్ ధావన్ కూడా పుష్ప డైలాగ్‌తో నెట్టింట్లో రచ్చ చేస్తున్నాడు. గతకొంతకాలంగా బెంచ్ కే పరిమితమైన ధావన్ ప్రస్తుతం వన్డే మ్యాచ్ కోసం ప్రీపేర్ అవుతున్నాడు.
సౌతాఫ్రికాతో జరుగబోయే వన్డే సిరీస్ లో ధావన్ ఆడనున్నాడు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ధావన్.. ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తుంటాడు. ఫన్నీ మీమ్స్, డ్యాన్స్‌లు, హిట్ సినిమాల్లోని పాపులర్ డైలాగ్‌లతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాడు. లేటెస్టుగా ‘పుష్ప’లోని సూపర్ హిట్ డైలాగ్ తగ్గేదేలే.. హిందీలో చెప్పి బన్నీ ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నాడు. పుష్ప… పుష్పరాజ్… మై ఝుకేగా నై(తగ్గేదేలే) అంటూ బల్ల బద్ధలు కొట్టేశాడు.. ధావన్ ఇన్ స్టాలో పోస్టు చేసిన వీడియో ఫుల్ రెస్పాన్స్ వస్తోంది.
View this post on Instagram
అభిమాన హీరో పవర్ఫుల్ డైలాగ్‌ని గబ్బర్ చెప్పడంతో బన్నీ ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. గబ్బర్ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. దక్షిణాఫ్రికా వన్డే సిరీస్‌కు గబ్బర్‌కు ఆల్ ద బెస్ట్ చెబుతున్నారు బన్నీ ఫ్యాన్స్.. జనవరి 19 నుంచి దక్షిణాఫ్రికా వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో భారత జట్టులో ధావన్ కు చోటు దక్కింది. గతేడాదిలో శ్రీలంక పర్యటనలో టీమిండియాకు సారథ్యం వహించాడు.
Read Also : IPL Mega-Auction : రెండు రోజులపాటు ఐపీఎల్ మెగా వేలం.. తేదీలు ఇవే..
- IPL2022 MI Vs PBKS : చెలరేగిన ధావన్, మయాంక్.. ముంబై ముందు భారీ లక్ష్యం
- Covid-19 New Variants : మరో రెండు ఒమిక్రాన్ వేరియంట్లను గుర్తించిన పరిశోధకులు
- IPL2022 Punjab Vs Bangalore : పంజాబ్ వీరోచిత పోరాటం.. బెంగళూరుపై సంచలన విజయం
- Womens World Cup 2022 : వరల్డ్‌కప్ నుంచి భారత్ నిష్క్రమణ, ఆఖరి బంతికి సౌతాఫ్రికా గెలుపు
- SA vs BAN : బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్.. 16మంది సభ్యుల సౌతాఫ్రికా జట్టు ఇదే..!
1Andhra Pradesh : ఆర్ధిక ఇబ్బందులతో బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ ఆత్మహత్య
2GVL Narasimharao: చంద్రబాబుకు పట్టిన గతే కేసీఆర్‌కు పడుతుంది: ఎంపీ జీవిఎల్
3F3: ఎఫ్3 ప్రీరిలీజ్ బిజినెస్.. అందుకుంటే ఫన్.. లేకపోతే ఫ్రస్ట్రేషన్!
4Madhya Pradesh : తోపుడు బండిపై భిక్షాటన కష్టంగా ఉందని మోపెడ్ కొనుక్కున్న యాచక దంపతులు
5WARTS : పులిపిర్లు ఎందుకొస్తాయ్! నివారణ ఎలాగంటే?
6Assam Floods: అస్సాంలో తెగిపడిన రైల్వే లైన్ల పునరుద్ధరణకు రూ.180 కోట్లు మంజూరు చేసిన కేంద్రం
7IPL 2022: లీగ్ దశలో టాప్ స్కోరర్లు వేరే
8Vikram: రన్‌టైమ్ లాక్ చేసిన విక్రమ్.. ఎంతంటే?
9Antarctica ice : అంటార్కిటికాలో గ్లోబల్ వార్మింగ్‌ను తట్టుకొని పెరిగిన ఐస్ షెల్ఫ్‌లు
10Lemon Juice : వేసవిలో శరీరాన్ని చల్లబరిచే నిమ్మరసం!
-
BJP Activist Attack : మతం పేరిట మానసిక వికలాంగుడైన వృద్ధుడిపై బీజేపీ కార్యకర్త దాడి
-
ISB Anniversary: మే 26న ఐఎస్బీ వార్షికోత్సవానికి రానున్న ప్రధాని: కేసీఆర్‌కూ ఆహ్వానం..కానీ!
-
Viral Video : టొరంటోలో తుఫాన్ బీభత్సం.. రాకాసి గాలులకు కొట్టుకుపోయిన ట్రాంపోలిన్
-
Chardam Vicinity Plastic : చార్దామ్ యాత్రలో ప్లాస్టిక్‌తో ముప్పు
-
Saudi Arabia : అంతర్జాతీయ ప్రయాణికులపై సౌదీ ఆంక్షలు..ఆ దేశాల నుంచి వచ్చేవారిపై బ్యాన్
-
NHAI JOBS : నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాల భర్తీ
-
Australia : ఆస్ట్రేలియాలో అండర్‌వేర్‌తో వచ్చి ఓటు వేసిన ఓటర్లు
-
Modi Japan Tour : హిందీలో పలకరించిన జపాన్ కిడ్స్.. వావ్ అంటూ మోదీ ఫిదా.. వీడియో వైరల్..!