Shikhar Dhawan – Shreyas: కొవిడ్ నెగెటివ్ వచ్చినా.. రెండో వన్డేకు శ్రేయాస్ అయ్యర్, శిఖర్ ధావన్‍లకు నో ఛాన్స్

శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్ లు ట్రైనింగ్ మొదలుపెట్టేశారు. కొవిడ్-19 నెగెటివ్ వచ్చినప్పటికీ కాస్త శిక్షణలో తక్కువగానే పాల్గొంటున్నారు. రుతురాజ్ గైక్వాడ్, నవదీప్ సైనీలతో పాటు....

Shikhar Dhawan – Shreyas: కొవిడ్ నెగెటివ్ వచ్చినా.. రెండో వన్డేకు శ్రేయాస్ అయ్యర్, శిఖర్ ధావన్‍లకు నో ఛాన్స్

Dhawan Iyer

Shikhar Dhawan – Shreyas: శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్ లు ట్రైనింగ్ మొదలుపెట్టేశారు. కొవిడ్-19 నెగెటివ్ వచ్చినప్పటికీ కాస్త శిక్షణలో తక్కువగానే పాల్గొంటున్నారు. రుతురాజ్ గైక్వాడ్, నవదీప్ సైనీలతో పాటు ఇతర సపోర్టింగ్ స్టాఫ్ నలుగురికి కొవిడ్ పాజిటివ్ వచ్చింది. అందరినీ ఫిబ్రవరి 6న ఆదివారమే ఐసోలేషన్ కు పంపించింది మేనేజ్మెంట్.

అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియంలో ట్రైనింగ్ లో పాల్గొన్నారు. వన్డే సిరీస్ మొత్తం ఇదే మైదానంలో నిర్వహించనున్నారు. బీసీసీఐ మెడికల్ టీం పర్యవేక్షణలోనే ప్లేయర్లు ఉన్నారని ఇంకా ఐసోలేషన్ లో ఉన్నారని అధికారులు చెబుతున్నారు.

ప్రొటోకాల్ ప్రకారం.. వారిద్దరినీ లైట్ ట్రైనింగ్ లో పాల్గొనేందుకు అనుమతించాం. అంతకంటే ముందు వారిని మెడికల్ టీం పరీక్షించి నిర్ణయం తెలిపింది. అని సిబ్బంది వెల్లడించారు.

Read Also: రౌడీ హీరో ఆశలన్నీ లైగర్‌పైనే.. గేమ్ ఛేంజర్ అవుతుందా?

సెకండ్ వన్డేకు కేఎల్ రాహుల్ జట్టుతో కలవనున్నాడు. మయాంక్ అగర్వాల్ అందుబాటులోనే ఉన్నా తుది జట్టులో ఎంపికపై ఆలోచిస్తున్నారు. తొలి వన్డేలో రోహిత్ శర్మతో పాటుగా ఇషాన్ కిషన్ ఓపెనింగ్ లో ఆడాడు. ఇప్పుడు వైస్ కెప్టెన్ రాహుల్ ఎంట్రీతో ఇషాన్ కు ఏ స్థానం దక్కుతుందో చూడాలి.

‘మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్ లు క్వారంటైన్ తర్వాత జట్టులోకి రావడం టీంకు బలం చేకూరుతుంది. టీమ్ మేనేజ్మెంట్ ఆడతారా లేదా అనేది నిర్ణయిస్తుంది. వారు రావడం చాలా సంతోషంగా ఉంది’ అని సూర్యకుమార్ యాదవ్ రెండో వన్డే ముందు మీడియా సమావేశంలో అన్నాడు.