India team: శ్రీలంక టూర్‌కు టీమ్ ఫైనల్.. గబ్బరే కెప్టెన్.. కోచ్‌గా..!

శ్రీలంక టూర్‌కు వెళ్లే భారత జట్టును ఎట్టకేలకు బీసీసీఐ ప్రకటించింది. బీసీసీఐ (BCCI) చరిత్రలో తొలిసారి.. టీమిండియా టెస్టు జట్టు ఇంగ్లాండ్ పర్యటనలో ఉండగా.. రెండో జట్టును శ్రీలంకకు పంపుతుంది. విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారతజట్టు ఇప్పటికే WTC ఫైనల్ కోసం ఇంగ్లాండ్ వెళ్లగా.. వచ్చే నెల శ్రీలంక పర్యటనలో భారత క్రికెట్ జట్టు పరిమిత ఓవర్ సిరీస్‌లో ఆడనుంది.

India team: శ్రీలంక టూర్‌కు టీమ్ ఫైనల్.. గబ్బరే కెప్టెన్.. కోచ్‌గా..!

India Team Sri Lanka Tour

India’s tour of Sri Lanka: శ్రీలంక టూర్‌కు వెళ్లే భారత జట్టును ఎట్టకేలకు బీసీసీఐ ప్రకటించింది. బీసీసీఐ (BCCI) చరిత్రలో తొలిసారి.. టీమిండియా టెస్టు జట్టు ఇంగ్లాండ్ పర్యటనలో ఉండగా.. రెండో జట్టును శ్రీలంకకు పంపుతుంది. విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారతజట్టు ఇప్పటికే WTC ఫైనల్ కోసం ఇంగ్లాండ్ వెళ్లగా.. వచ్చే నెల శ్రీలంక పర్యటనలో భారత క్రికెట్ జట్టు పరిమిత ఓవర్ సిరీస్‌లో ఆడనుంది. శ్రీలంకతో జరిగే వన్డే, టీ20 సిరీస్ కోసం ముందు నుంచి అనుకున్నట్లుగా ఓపెనర్ శిఖర్ ధావన్‌తో కెప్టెన్‌గా భారత సెలెక్టర్స్ కమిటీ జట్టును ప్రకటించింది. పేసర్ భువనేశ్వర్ కుమార్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.

టెస్ట్ జట్టు నుంచి తప్పుకున్న కుల్దీప్ యాదవ్ పరిమిత ఓవర్ల సిరీస్‌లో చోటు దక్కించుకున్నారు. దీంతో పాటు నితీష్ రానా, దేవదత్ పాడికల్, రితురాజ్, చేతన్ సకారియలను తొలిసారిగా జట్టులో అడుగుపెట్టారు. జులైలో జరుగనున్న ద్వైపాక్షిక సిరీస్‌కు సంబంధించి శ్రీలంక క్రికెట్ బోర్డు ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసింది. ఈ టూర్‌లో భారత్-శ్రీలంక జట్లు.. 3 టీ20లు, 3 వన్డేలు ఆడనున్నాయి. జూలై 13 నుంచి 25 మధ్య ఇరు జట్లు పోటీ పడుతాయి.

లిమిటెడ్ ఓవర్ల స్పెషలిస్టులతో కూడిన జట్టు లంక పర్యటనకు వెళ్తుండగా.. ఈ జట్టుకు రాహుల్ ద్రావిడ్ కోచ్‌గా వ్యవహరించనున్నారు. ఈ మ్యాచ్‌లకు సోనీ స్పోర్ట్స్ మీడియా పార్టనర్‌గా వ్యవహరిస్తోంది.

భారత జట్టు: శిఖర్‌ ధావన్‌(కెప్టెన్‌), భువనేశ్వర్‌ కుమార్‌(వైస్‌ కెప్టెన్‌), పృథ్వీ షా, దేవ్‌దత్‌ పడిక్కల్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, మనీష్‌ పాండే, హార్దిక్‌ పాండ్యా, నితీష్‌ రాణా, ఇషాన్‌ కిషన్‌(వికెట్‌ కీపర్‌), సంజు శాంసన్‌(వికెట్‌ కీపర్‌), చాహల్‌, రాహుల్‌ చాహర్‌, కిష్టప్ప గౌతమ్‌, కృనాల్‌ పాండ్యా, కుల్‌దీప్‌ యాదవ్‌, వరణ్‌ చక్రవర్తి, దీపక్‌ చాహర్‌, నవ్‌దీప్‌ సైనీ, చేతన్‌ సకారియా

నెట్‌ బౌలర్స్‌: ఇషాన్‌ పోరెల్‌, సందీప్‌ వారియర్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, సాయి కిషోర్‌, సిమర్‌జీత్‌ సింగ్‌