T20 World Cup: 6,6,6,6,6,6.. నలభై ఏళ్ల వయస్సులోనూ.. మాలిక్ తుఫాను ఇన్నింగ్స్!

టీ20 ప్రపంచకప్‌-2021లో పాకిస్తాన్‌ సీనియర్‌ బ్యాట్స్‌మెన్ షోయబ్‌ మాలిక్‌ స్కాట్లాండ్‌పై మ్యాచ్‌లో చెలరేగి ఆడాడు.

T20 World Cup: 6,6,6,6,6,6.. నలభై ఏళ్ల వయస్సులోనూ.. మాలిక్ తుఫాను ఇన్నింగ్స్!

Malik

T20 World Cup: టీ20 ప్రపంచకప్‌-2021లో పాకిస్తాన్‌ సీనియర్‌ బ్యాట్స్‌మెన్ షోయబ్‌ మాలిక్‌ స్కాట్లాండ్‌పై మ్యాచ్‌లో చెలరేగి ఆడాడు. సిక్సర్ల వర్షం కురిపించి.. కేవలం 18 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు. ఈ టోర్నీలో అత్యంత వేగవంతమైన హాఫ్‌ సెంచరీ సాధించిన రికార్డు కేఎల్‌ రాహుల్‌(18 బంతుల్లో 50, స్కాట్లాండ్‌పై) ఉండగా.. రాహుల్‌తో సమానంగా తొలి స్థానంలో నిలిచాడు.

ఓవరాల్‌గా చూస్తే యువరాజ్‌ సింగ్‌(12 బంతులు, 2007, ఇంగ్లండ్‌పై) ఫస్ట్ ప్లేస్‌లో ఉండగా.. స్టీఫన్‌ మైబర్గ్‌(17 బంతులు, 2014, ఐర్లాండ్‌పై), సెకండ్ ప్లేస్‌లో.. గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌(18 బంతులు, 2014, పాకిస్తాన్‌పై), కేఎల్‌ రాహుల్‌(18 బంతులు, 2021, స్కాట్లాండ్‌పై), షోయబ్‌ మాలిక్‌(18 బంతులు, 2021, స్కాట్లాండ్‌పై) రికార్డుల్లో ఉన్నారు.

పాకిస్తాన్‌ తరపున టీ20ల్లో ఫాస్టెస్ట్ హాఫ్‌ సెంచరీ చేసిన ఆటగాడిగా మాలిక్‌ ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నారు. ఉమర్‌ అక్మల్‌( 2010లో ఆస్ట్రేలియాపై 21 బంతుల్లో, 2016లో న్యూజిలాండ్‌పై 22 బంతుల్లో) రెండోస్థానంలో ఉన్నాడు. షోయబ్ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో భార్య సానియా మీర్జా కూడా కూడా చాలా హ్యాపీగా కనిపించింది. ఆమె తన కొడుకుతో స్టాండ్‌లో ఉండి షోయబ్ షాట్‌లకి చప్పట్లు కొడుతూ ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

పాకిస్తాన్ సీనియర్ బ్యాట్స్‌మెన్ షోయబ్ మాలిక్ 40 ఏళ్ల వయసులోనూ రాణిస్తున్నాడు. మాలిక్ మొత్తం 18 బంతుల్లో 54 పరుగులు చేశాడు. షోయబ్ మాలిక్ తన ఇన్నింగ్స్‌లో 6 సిక్సర్లు, ఒక్క ఫోర్ కొట్టాడు. చివరి ఓవర్‌లో మూడు సిక్సర్లు, ఒక ఫోర్ కొట్టాడు మాలిక్. షోయబ్ మాలిక్‌కు స్కాట్‌లాండ్‌పై మంచి రికార్డే ఉంది. 2018లో 27 బంతుల్లో 53 పరుగులు, 2018లో 22 బంతుల్లో 49పరుగులు.. షార్జాలో 18 బంతుల్లో 54 పరుగులు చేశాడు.

Read More:

Covid’s AY.4.2 : భయం వద్దు…AY.4.2 వేరియంట్ ప్రభావం తక్కువే!

Akshay Kumar : అక్షయ కుమార్ సినిమాకి పంజాబ్ రైతుల సెగ

Ministers: పవర్ స్టార్‌కు పద్మశ్రీ.. మంత్రులు డిమాండ్!