Shreyas Iyer: కెప్టెన్సీ కోసం శ్రేయాస్ అయ్యర్ ఎదురుచూపులు

గాయం నుంచి కోలుకుని లీగ్ లోకి తిరిగి అడుగుపెట్టిన స్టార్ బ్యాట్స్ మన్ శ్రేయాస్ అయ్యర్.. ఐపీఎల్‌ ఫ్రాంఛైజీ దిల్లీ క్యాపిటల్స్ కు గుడ్ బై చెప్పనున్నట్లు తెలుస్తుంది.

Shreyas Iyer: కెప్టెన్సీ కోసం శ్రేయాస్ అయ్యర్ ఎదురుచూపులు

Delhi Capitals

Shreyas Iyer: గాయం నుంచి కోలుకుని లీగ్ లోకి తిరిగి అడుగుపెట్టిన స్టార్ బ్యాట్స్ మన్ శ్రేయాస్ అయ్యర్.. ఐపీఎల్‌ ఫ్రాంఛైజీ దిల్లీ క్యాపిటల్స్ కు గుడ్ బై చెప్పనున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం వికెట్ కీపర్ – బ్యాట్స్ మన్ రిషబ్ పంత్ ను కెప్టెన్సీ వహిస్తున్న డిల్లీ జట్టుకు ఒకప్పుడు అయ్యర్ కెప్టెన్ గా వ్యవహరించాడు. గాయం కారణంగా లీగ్ కు కాస్త బ్రేక్ ఇవ్వడంతో కెప్టెన్సీకి దూరమయ్యాడు.

తిరిగి లీగ్ లోకి అడుగుపెట్టినప్పటికీ కెప్టెన్సీ పగ్గాలు అప్పగించలేదు. పంత్ నే కెప్టెన్ గా కొనసాగించారు. కెప్టెన్ గా పంత్ మంచి ఫినిషింగ్ ఇవ్వడంతో జట్టును గ్రూప్ స్టేజి నుంచి దాటించి ప్లే ఆఫ్ వరకూ చేర్చడంలో సక్సెస్ అయ్యాడు.

విరాట్ కోహ్లీ రాజీనామా తర్వాత బెంగళూరు జట్టుతో పాటు అహ్మదాబాద్, లక్నో జట్లకు కూడా కెప్టెన్ అవసరం. కేఎల్ రాహుల్ పంజాబ్ జట్టును వదిలేసే అవకాశాలు కనిపిస్తుండటంతో అయ్యర్ మళ్లీ కెప్టెన్ అవుతాడని భావిస్తున్నారు.

…………………………………..: ఎయిర్ గన్ మిస్ ఫైర్.. యువకుడు మృతి

ఐపీఎల్ రూల్స్ ప్రకారం.. గరిష్ఠంగా నలుగురు ప్లేయర్లను మాత్రమే ఫ్రాంచైజీలు ఉంచుకోవాలి. ముగ్గురు ఇండియన్లు ఒక విదేశీ ప్లేయర్ లేదా ఇద్దరు ఇండియన్లు ఇద్దరు విదేశీ ప్లేయర్లను ఉంచుకోవాలి. ఇంకా కొత్తగా వస్తున్న లక్నో, అహ్మదాబాద్ జట్లు సైతం ముగ్గురు చొప్పున కొత్త ప్లేయర్లను వేలం కంటే ముందే అందుబాటులో ఉన్న ప్లేయర్ల నుంచి ఎంచుకోవచ్చు.