ODI player rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో మెరుగుపడ్డ శ్రేయాస్ అయ్యర్, శుభ్‌మన్ గిల్

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్, శుభ్‌మన్ గిల్ మెరుగుపడ్డారు. అయితే, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మాత్రం ఒక్కో స్థానం దిగజారారు. అలాగే, శిఖర్ ధావన్ రెండు స్థానాలు దిగజారాడు. తాజాగా, ప్రకటించిన వన్డే ర్యాంకుల్లో శ్రేయాస్ అయ్యర్ ఆరు స్థానాలు ఎగబాకి 27వ స్థానంలోకి, శుభ్‌మన్ గిల్ మూడు స్థానాలు మెరుగుపర్చుకుని 34వ స్థానంలోకి చేరుకున్నారు.

ODI player rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో మెరుగుపడ్డ శ్రేయాస్ అయ్యర్, శుభ్‌మన్ గిల్

ODI player rankings

ODI player rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్, శుభ్‌మన్ గిల్ మెరుగుపడ్డారు. అయితే, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మాత్రం ఒక్కో స్థానం దిగజారారు. అలాగే, శిఖర్ ధావన్ రెండు స్థానాలు దిగజారాడు. తాజాగా, ప్రకటించిన వన్డే ర్యాంకుల్లో శ్రేయాస్ అయ్యర్ ఆరు స్థానాలు ఎగబాకి 27వ స్థానంలోకి, శుభ్‌మన్ గిల్ మూడు స్థానాలు మెరుగుపర్చుకుని 34వ స్థానంలోకి చేరుకున్నారు.

తాజాగా, న్యూజిలాండ్ తో జరిగిన వన్డేల్లో వీరిద్దరు రాణించారు. ఇక కోహ్లీ ఒక స్థానం దిగజారి ఎనిమిదో స్థానంలోకి, రోహిత్ శర్మ తొమ్మిదో స్థానంలోకి దిగజారారు. వీరిద్దరు న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లలేదన్న విషయం తెలిసిందే. న్యూజిలాండ్ తో జరిగిన వన్డే సిరీస్ లో సారథ్యం వహించిన శిఖర్ ధావన్ ఐసీీసీ ర్యాంకింగ్స్ లో రెండు స్థానాలు దిగజారి 15వ స్థానంలో ఉన్నాడు.

New Zealand vs India: మూడో వన్డే వర్షార్పణం.. 1-0 తేడాతో భారత్‌పై సిరీస్ గెలిచిన న్యూజిలాండ్

ఇక ఐసీసీ వన్డే బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్ లో బాబర్ అజాం (పాకిస్థాన్) అగ్రస్థానంలో, ఇమామ్ ఉల్ హక్ (పాకిస్థాన్) రెండో స్థానంలో, రస్సీ వాన్ డెర్ దస్సెన్ (దక్షిణాఫ్రికా) మూడో స్థానంలో, క్వింటన్ డీ కాక్ (దక్షిణాఫ్రికా) నాలుగో స్థానంలో, డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా) ఐదో స్థానంలో ఉన్నారు. ఇక బౌలింగ్, ఆల్ రౌండర్ జాబితాలో భారత ఆటగాళ్లలో టాప్-10లో ఒక్కరు కూడా లేరు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..