IPL2023: అప్పట్లో సచిన్, కోహ్లి.. ఇప్పుడు శుభ్‌మన్ గిల్.. పరుగులు చేసినా జట్టును గెలిపించలేకపోయారు
క్రికెట్ ప్రేమికులను నెలన్నర రోజులకు పైగా అలరించిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 2023 సీజన్ ముగిసింది. ఈ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ 890 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్‌ను సొంతం చేసుకున్నాడు. అంతేకాకుండా మోస్ట్ వాల్యూయబుల్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ అవార్డును అందుకున్నాడు.

Shubman Gill becomes 3rd indian to winning orange cap and mvp award
IPL2023- Shubman Gill: క్రికెట్ ప్రేమికులను నెలన్నర రోజులకు పైగా అలరించిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 2023 సీజన్ ముగిసింది. సోమవారం గుజరాత్ టైటాన్స్(Gujarat Titans), చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) మధ్య అహ్మదాబాద్ వేదికగా నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌తో సీజన్ కు తెరపడింది. ఉత్కంఠగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. ఐపీఎల్ చరిత్రలో చెన్నైకి ఇది ఐదో ట్రోఫి. ఈ క్రమంలో ఐపీఎల్‌లో అత్యధిక టైటిళ్లు అందుకున్న ముంబై ఇండియన్స్ రికార్డును సీఎస్‌కే సమం చేసింది.
ఈ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ 890 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్‌ను సొంతం చేసుకున్నాడు. అంతేకాకుండా మోస్ట్ వాల్యూయబుల్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ అవార్డును అందుకున్నాడు. సీజన్ ఆద్యంతం గిల్ రాణించినప్పటికి గుజరాత్ కప్పును అందుకోలేకపోయింది.
IPL2023 Final: ఉత్కంఠ పోరులో గుజరాత్‌పై చెన్నై విజయం.. కప్పు ధోని సేనదే
Proven super 🌟, rightful MVP 💙@ShubmanGill | #AavaDe | #TATAIPL 2023 pic.twitter.com/bIXnxZquRv
— Gujarat Titans (@gujarat_titans) May 30, 2023
ఇదిలా ఉంటే.. ఓ ఆటగాడు సీజన్‌లో అత్యధిక పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్‌తో పాటు మోస్ట్ వాల్యూయబుల్ ప్లేయర్ అవార్డు అందుకున్నప్పటికి అతడి జట్టు గెలవలేకపోయిన జాబితాలో ఇప్పటి వరకు దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్, రికార్డు రారాజు విరాట్ కోహ్లి ఉండగా ఇప్పుడు గిల్ కూడా చేరాడు.
అందరికంటే ముందు ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ ఉన్నాడు. 2010 సీజన్‌లో ముంబై ఇండియన్స్‌కు ఆడిన సచిన్ ఆ సీజన్‌లో 618 పరుగులు చేసి ఆరెంజ్ క్యాపును అందుకున్నాడు. అదే సమయంలో ఆ సీజన్‌లో మోస్ట్ వాల్యూయబుల్ అవార్డును గెలుచుకున్నాడు. అయితే.. ముంబై మాత్రం కప్పును అందుకోలేకపోయింది. ఫైనల్‌లో చెన్నై చేతిలో ఓడిపోయింది. 2016లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆడిన విరాట్ కోహ్లి ఆ సీజన్‌లో అద్భుతంగా రాణించాడు. నాలుగు శతకాలు బాది 973 పరుగులు చేశాడు. ఆరెంజ్ క్యాప్‌తో పాటు మోస్ట్ వాల్యూయబుల్ అవార్డు అందుకున్నాడు. అయితే.. ఆర్‌సీబీ మాత్రం కప్పును గెలవలేదు. ఫైనల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓడిపోయింది.