Prithvi Shaw: పృథ్వీ షా పై గిల్ చిన్ననాటి కోచ్ సంచలన వ్యాఖ్యలు
ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 2023 సీజన్‌లో పృథ్వీ షా(Prithvi Shaw) విఫలం అయ్యాడు. ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) తరుపున బరిలోకి దిగి ఫామ్ లేమితో తీవ్రంగా విమర్శల పాలు అయ్యాడు.

Prithvi Shaw-Shubman Gill
Prithvi Shaw-Shubman Gill: ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 2023 సీజన్‌లో పృథ్వీ షా(Prithvi Shaw) విఫలం అయ్యాడు. ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) తరుపున బరిలోకి దిగి ఫామ్ లేమితో తీవ్రంగా విమర్శల పాలు అయ్యాడు. అదే సమయంలో అతడి సహచర ఆటగాడు శుభ్‌మన్ గిల్(Shubman Gill) మాత్రం పరుగుల వరద పారించాడు. గుజరాత్ ఓపెనర్‌గా బరిలోకి దిగిన గిల్ ఈసీజన్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. కాగా.. గిల్, షా లు ఇద్దరు 2018లో భారత అండర్-19 ప్రపంచకప్ గెలిచిన జట్టు సభ్యులు అన్న సంగతి తెలిసిందే.
టీమ్ఇండియా తరుపున మూడు ఫార్మాట్లలో గిల్ కీలక ఆటగాడిగా మారగా, జట్టులో స్థానంలో కోసం పృథ్వీ షా పోరాడుతున్నాడు. ఈ క్రమంలో పృథ్వీ షాపై గిల్ చిన్ననాటి కోచ్ కార్సాన్ గర్వి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇప్పటికి పృథ్వీ షా తనను తాను ఓ సూపర్ స్టార్ గా ఊహించుకుంటాడని, తనను ఎవ్వరూ టచ్ చేయలేరని బావిస్తుంటాడని పేర్కొన్నాడు.
IPL2023: ఐపీఎల్ విజేతకు ఎన్నికోట్లంటే..? ఆరెంజ్, పర్పుల్ క్యాప్ ఆటగాళ్లకి ఎంతిస్తారంటే..?
‘2018లో అండర్ -19 ప్రపంచకప్ గెలిచిన జట్టులో ఇద్దరు సభ్యులే. ఈ రోజు వీరిద్దరు ఎక్కడ ఉన్నారు. ఇద్దరు వేరు వేరు కేటగిరీ ఆటగాళ్లుగా మారిపోయారు. షా ఎప్పుడూ తనని తాను ఓ స్టార్‌గా బావిస్తాడు. తనను ఎవ్వరూ అందుకోలేరని అనుకుంటాడు. ఇక్కడ గుర్తించుకోవాల్సిన విషయం ఏమిటంటే..? అది అంతర్జాతీయ క్రికెట్ కావొచ్చు లేదా రంజీ క్రికెట్ కావొచ్చు, టీ20 క్రికెట్ కావొచ్చు. ఏదైనా సరే ఔట్ కావడానికి ఒక్క బంతి సరిపోతుందని. అత్యున్నత స్థాయిలో రాణించాలంటే క్రమశిక్షణ, నిరంతరం సాధన చేయాల్సి ఉంటుందని’ కార్సాన్ గర్వి అన్నారు.
‘పృథ్వీ షా, గిల్‌లు ఒకే వయస్సు కలిగిన ప్లేయర్లు. గిల్ కష్టపడడంతో ఫలితం దక్కుతోంది. షా మాత్రం అలా చేయలేదు. ఇప్పటికీ జట్టులో స్థానం కోసం పోటీ పడుతున్నారు. క్రీజులో పాతుకుపోతే పరుగులు వాటిఅంతటా అవే వస్తాయి. ఇప్పటికైనా సమయం మించిపోలేదు. కాబట్టి షా తన లోపాలపై దృష్టి పెట్టి కష్టపడితే భవిష్యత్తులో బలమైన ఆటగాడిగా ఎదుగుతాడు. లేదంటే కష్టమే’ అని గర్వి చెప్పుకొచ్చారు.
Shubman Gill : స్పైడర్ మ్యాన్ కోసం శుభ్‌మన్ గిల్ ప్రమోషన్స్.. కారు మీద స్టంట్స్!
ఐపీఎల్ 2023 సీజన్‌లో పృథ్వీ షా మొదటి ఆరు మ్యాచుల్లో 12, 7, 0, 15, 0,13 పరుగులు చేశాడు. దీంతో జట్టు నుంచి పక్కకు తప్పించారు. ఆఖరి రెండు మ్యాచులకు తుది జట్టులో చోటు కల్పించగా ఓ అర్ధశతకం చేశాడు. అయినప్పటికి అతడి బ్యాటింగ్‌పై విమర్శలు వస్తూనే ఉన్నాయి.