Orange Cap: గిల్‌కే ఆరెంజ్ క్యాప్.. ఒకవేళ సీఎస్కే బ్యాటర్‌కు దక్కాలంటే ఫైనల్లో ఎన్ని వందల పరుగులు చేయాలో తెలుసా?

శుభ్‌మన్ గిల్ ఈ ఐపీఎల్ లో మొత్తం 851 పరుగులు చేశాడు. 16 మ్యాచ్‌లు ఆడిన అతడు 60.79 యావరేజ్ తో 156.43 స్ట్రైక్ రేటుతో ఆ పరుగులు చేశాడు.

Orange Cap: గిల్‌కే ఆరెంజ్ క్యాప్.. ఒకవేళ సీఎస్కే బ్యాటర్‌కు దక్కాలంటే ఫైనల్లో ఎన్ని వందల పరుగులు చేయాలో తెలుసా?

Shubman gill

Orange Cap- Shubman gill: అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసే బ్యాటర్ కు ఇచ్చే ఆరెంజ్ క్యాప్ ను ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL-2023)లో గుజరాత్ టైటాన్స్(GT) బ్యాటర్ శుభ్‌మన్ గిల్ ఖరారు చేసుకున్నాడు. ప్రస్తుతం గిల్ ఆరెంజ్ క్యాప్ రేసులో అగ్రస్థానంలో ఉన్నాడు.

శుభ్‌మన్ గిల్ ఈ ఐపీఎల్ లో మొత్తం 851 పరుగులు చేశాడు. 16 మ్యాచ్‌లు ఆడిన అతడు 60.79 యావరేజ్ తో 156.43 స్ట్రైక్ రేటుతో ఆ పరుగులు చేశాడు. అతడి అత్యధిక స్కోరు 129. ఈ ఐపీఎల్ లో గిల్ మొత్తం మూడు సెంచరీలు, నాలుగు హాఫ్ సెంచరీలు బాదాడు. ఆరెంజ్ క్యాప్ ను గెలుచుకునే అవకాశం అతడికి తప్ప మరే బ్యాటర్ కూ లేదు. ఆదివారం ఫైనల్ జరగనున్న విషయం తెలిసిందే. ఫైనల్లో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి.

ఆర్సీబీ (RCB) బ్యాటర్ డు ప్లెసిస్ (Faf Du Plessis) ఐపీఎల్ లో మొత్తం 730 పరుగులు చేశాడు. ఇప్పటివరకు అతడు రెండో స్థానంలో ఉన్నాడు. అతడి జట్టు ఫ్లేఆఫ్స్ కు చేరుకోలేకపోయిన విషయం తెలిసిందే. దీంతో ఫైనల్ లో డు ప్లెసిస్ ఆడడు కాబట్టి అతడు ఈ సీజన్ లో 730 పరుగులకే పరిమితం అయ్యాడు.

ఇక ఆరెంజ్ క్యాప్ రేసులో మూడు, నాలుగు, ఐదవ స్థానాల్లో వరుసగా ఆర్సీబీ బ్యాటర్ విరాట్ కోహ్లీ (639), రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ (625), సీఎస్కే బ్యాటర్ కాన్వే (625 పరుగులు) ఉన్నారు. ఆర్సీబీ, రాజస్థాన్ రాయల్స్ ఫైనల్ లో లేవు. సీఎస్కే జట్టు ఉంది. దీంతో సీఎస్కే బ్యాటర్ కాన్వే ఆరెంజ్ క్యాప్ గెలుచుకోవాలంటే ఒకే ఒక్క మ్యాచ్ లో 226 పరుగులు చేయాలి. అది సాధ్యం కాదు కాబట్టి శుభ్‌మన్ గిల్ కే ఆ క్యాప్ దక్కుతుంది.

IPL2023: శుభ్‌మ‌న్‌గిల్ మ‌రో హ్యాట్రిక్‌.. రోహిత్‌, కోహ్లి వ‌ల్ల కూడా కాలేదు.. ఒక్క ధోనికి త‌ప్ప‌..!