Shubman Gill: గిల్ టెస్టుల్లో పదివేల పరుగులు సాధిస్తాడు.. గిల్‌పై ప్రశంసలు కురిపించిన గవాస్కర్

గుజరాత్, అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఇండియా-ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగో టెస్టు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో శనివారం గిల్ సెంచరీ సాధించాడు. 235 బంతుల్లో 128 పరుగులు సాధించి, లయన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

Shubman Gill: గిల్ టెస్టుల్లో పదివేల పరుగులు సాధిస్తాడు.. గిల్‌పై ప్రశంసలు కురిపించిన గవాస్కర్

Shubman Gill: ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో సెంచరీ సాధించిన శుభ్‌మన్‌ గిల్‌పై మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ ప్రశంసల జల్లు కురిపించాడు. టెస్టుల్లో గిల్ పదివేల పరుగుల మైలురాయిని దాటుతాడని గవాస్కర్ ఆశాభావం వ్యక్తం చేశారు.

Goa Forest Fire: గోవాలో దావానలం.. తగలబడుతున్న అడవులు.. ప్రధాని మోదీ సమీక్ష

గుజరాత్, అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఇండియా-ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగో టెస్టు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో శనివారం గిల్ సెంచరీ సాధించాడు. 235 బంతుల్లో 128 పరుగులు సాధించి, లయన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఇది అతడికి స్వదేశంలో మొదటి టెస్టు సెంచరీ కాగా.. కెరీర్లో రెండో టెస్టు సెంచరీ. ఈ మ్యాచ్‌లో గిల్ ఆటతీరును గవాస్కర్ ప్రశంసించారు. ‘‘గిల్ ఎంతో ఆత్మవిశ్వాసంతో ఆడాడు. మిచెల్ స్టార్క్ లాంటి పేస్ బౌలర్‌ను కూడా ధీటుగా ఎదుర్కొన్నాడు. వెనక్కు వంగి మరీ డిఫెన్స్ షాట్ ఆడుతున్నాడు.

Madhya Pradesh: మూడు ట్రక్కులు ఢీ.. చెలరేగిన మంటలు.. ఇద్దరు మృతి

లైన్ అండ్ లెంత్‌ బాగా చూసుకుని ఆడుతున్నాడు. అతడి ఆటతీరు చూడటానికి ఎంతో బాగుంది. అతడిలో ఆత్మవిశ్వాసం కనిపిస్తోంది. గిల్ తన ఆటతీరును సరిగ్గా మలచుకోగలిగితే అతడు టెస్టుల్లో 8,000-10,000 పరుగులు చేయగలడు’’ అని గవాస్కర్ వ్యాఖ్యానించాడు. ఇటీవలి కాలంలో గిల్ అద్భుత ఆటతీరు ప్రదర్శిస్తున్నాడు. ఈ ఏడాదిలోనే ఇప్పటివరకు గిల్ ఐదు సెంచరీలు నమోదు చేశాడు. వన్డేలు, టెస్టులు, టీ20.. ఇలా ఈ ఏడాది మూడు ఫార్మాట్లలోనూ గిల్ సెంచరీలు సాధించడం విశేషం. అందుకే అతడిపై అభిమానులు, మాజీ ఆటగాళ్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.