PV Sindhu: పీవీ సింధు ఇక ఇంటికే.. ఇలా నాలుగోసారి

భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధుకు మరోసారి అదే ఫలితం ఎదురై నిరాశ తప్పలేదు. ఇండోనేషియా ఓపెన్‌ సూపర్‌–1000 బ్యాడ్మింటన్‌ టోర్నీలో ఆమె పోరాటం సెమీఫైనల్లోనే ముగిసింది. శనివారం జరిగిన...

PV Sindhu: పీవీ సింధు ఇక ఇంటికే.. ఇలా నాలుగోసారి

Pv Sindhu

PV Sindhu: భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధుకు మరోసారి అదే ఫలితం ఎదురై నిరాశ తప్పలేదు. ఇండోనేషియా ఓపెన్‌ సూపర్‌–1000 బ్యాడ్మింటన్‌ టోర్నీలో ఆమె పోరాటం సెమీఫైనల్లోనే ముగిసింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్‌ సెమీస్‌లో మూడో సీడ్‌ సింధు 21-15, 9-21, 14-21తో రెండో సీడ్‌ రచనోక్‌ ఇంటోనన్‌ (థాయ్‌లాండ్‌)పై పోరాడి ఓడింది.

54 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సింధు తొలి గేమ్‌ను దక్కించుకున్నప్పటికీ ఆ తర్వాత తడబడింది. టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెల్చుకున్నాక సింధు ఆడిన నాలుగు టోర్నీల్లో సెమీఫైనల్‌ దశను దాటి ముందుకెళ్లలేదు.

తొలి గేమ్‌లో దూకుడుగా ఆడి ఆరంభంలోనే 8-3తో ఆధిక్యాన్ని దక్కించుకుని.. రచనోక్‌ నుంచి పోరాటాన్ని తట్టుకుంటూ.. 21-15తో గేమ్‌ గెలిచింది. రెండో గేమ్‌లో రివర్స్ అయింది. రచనోక్ విజృంభించి విరామ సమయానికి 11-7తో ఆధిక్యంలో నిలిచింది. ఆ తర్వాత 12 పాయింట్లలో 10 పాయింట్లు సొంతం చేసుకున్న థాయ్‌ స్టార్‌ గేమ్‌ గెలిచింది.

 

……………………………: రూ.370 వరకూ మళ్లీ పెరిగిన బంగారం ధర..

నిర్ణయాత్మక మూడో గేమ్‌లో రచానోక్‌ రెచ్చిపోయింది. బ్రేక్‌ సమయానికి ఆమె 11-6తో నిలిచింది. వరుస పాయింట్లు సాధించిన సింధు 13-16తో ప్రత్యర్థిని సమీపించినప్పటికీ తర్వాత అనసవర తప్పిదాలు చేసి పట్టు కోల్పోయింది. అదను చూసి రచనోక్‌.. 21-14తో గేమ్‌తో పాటు మ్యాచ్‌ను సొంతం చేసుకుంది.

వరుసగా పదోసారి…
మరోవైపు పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌శెట్టి పోరాటం ముగిసింది. సెమీఫైనల్లో ప్రపంచ 11వ ర్యాంకు జోడీ సాత్విక్‌-చిరాగ్‌ 16-21, 18-21తో టాప్‌ సీడ్‌ జంట మార్కస్‌ ఫెర్నాడీ-కెవిన్‌ సంజయ (ఇండోనేసియా) చేతిలో పోరాడి ఓడింది.గిడియోన్‌–కెవిన్‌ ద్వయం చేతిలో సాత్విక్‌–చిరాగ్‌లకిది వరుసగా పదో పరాజయం కావడం గమనార్హం.

 

……………………………………….. : సీతారామశాస్త్రి ఆరోగ్యంపై వస్తున్న వార్తలు అవాస్తవం