Tokyo Olympics 2020 : టోక్యో ఒలింపిక్స్ కోసం ఈ బుల్లి బస్సుని ప్రత్యేకంగా తయారు చేశారట!

రగ్బీ మ్యాచ్ లో బాల్ అందించేందుకు ఓ బుల్లి వాహనాన్ని ఉపయోగించారు. జపాన్ కు చెందిన టొయోటా మోటార్స్ తయారు చేసిన ఈ బుల్లి వాహనాలను బాల్ అందించేందుకు గ్రౌండ్ లో దింపారు. ఈ వాహనం సొంతంగా హ్యాండిల్ చేయగలిగే ఒక ట్విట్టర్ ఖాతాను కలిగి ఉంటుంది.

Tokyo Olympics 2020 :  టోక్యో ఒలింపిక్స్ కోసం ఈ బుల్లి బస్సుని ప్రత్యేకంగా తయారు చేశారట!

Tokyo Olympics 2020 (3)

Tokyo Olympics 2020 : జపాన్ రాజధాని టోక్యో నగరంలో 2020 ఒలింపిక్స్ జరుగుతున్నాయి. ఈ గేమ్స్ కు టొయోటా కంపెనీ స్పాన్సర్ గా వ్యవహరిస్తుంది. ఈ నేపథ్యంలోనే అనేక దేశాల నుంచి వచ్చే అథ్లెట్ల కోసం ఈ కంపెనీ వాహనాలు ఏర్పాటు చేసింది. ఇందులో డ్రైవర్లెస్ వాహనాలతోపాటు.. ఎలక్ట్రిక్ వాహనాలు కూడా ఉన్నాయి.

ఇక ఇదిలా ఉంటే రగ్బీ మ్యాచ్ లో బాల్ అందించేందుకు ఓ బుల్లి వాహనాన్ని ఉపయోగించారు. జపాన్ కు చెందిన టొయోటా మోటార్స్ తయారు చేసిన ఈ వాహనాలను బాల్ అందించేందుకు గ్రౌండ్ లో దింపారు. దీనిని గ్రౌండ్ వెలుపల ఉన్న వ్యక్తి రిమోట్ ద్వారా ఆపరేట్ చేస్తారు. ఇక ఈ వాహనం సొంతంగా హ్యాండిల్ చేసుకోగలిగే ఒక ట్విట్టర్ ఖాతాను కలిగి ఉంటుంది.

ప్రస్తుతం ఈ వాహనానికి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. జపాన్, ఫిజీల మధ్య జరిగిన మ్యాచ్ లో ఇది కనిపించింది. దీనిని చూసి అందరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రిమోట్ కంట్రోల్ ద్వారా నడిచే ఈ వాహనం చూపరులను ఆకట్టుకుంది. రబ్బీ మ్యాచ్ లో బాల్ బాయ్ గా తన సేవలు అందిస్తుంది.

ఇక ఇదిలా ఉంటే టొయోటా కంపెనీ టోక్యో ఒలింపిక్స్ కోసం ఎలక్ట్రిక్ కార్లను ఉపయోగిస్తుంది. ఇవి అథ్లెట్లను స్టేడియం, హోటల్స్ మధ్య తిప్పేందుకు ఉపయోగిస్తున్నారు. వీటిలో ఎక్కువగా డ్రైవర్ లెస్ కార్లే ఉన్నాయి.