అఫ్రిదిపై గంభీర్ ఫైర్…బుర్ర పెరగలేదు

  • Published By: venkaiahnaidu ,Published On : August 29, 2019 / 11:50 AM IST
అఫ్రిదిపై గంభీర్ ఫైర్…బుర్ర పెరగలేదు

కశ్మీర్ విషయంలో భారత్ పై విమర్శలు చేస్తూ ఎల్‌వోసీ దగ్గర శాంతి పతాకం ఎగరేస్తానన్న పాకిస్తాన్ మాజీ క్రికెటర్‌ షాహిద్‌ అఫ్రిదిపై టీమిండియా మాజీ క్రికెటర్‌, బీజేపీ ఎంపీ గౌతమ్‌ గంభీర్‌ ఫైర్ అయ్యారు. అఫ్రిదికి వయసు, బుర్ర పెరగలేదన్నాడు. కొందరు మనుషులు ఎప్పటికీ ఎదగరు. వారు క్రికెట్‌ ఆడతారు కానీ వయసుకు రారు. అంతేకాదు వారి బుర్రలు సైతం ఎదగవు అని గంభీర్‌ ఘాటుగా స్పందించాడు.

ప్రధాని పిలుపునిచ్చిన కశ్మీర్‌ అవర్‌కు ఒక జాతిగా స్పందించండి. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు నేను మహ్మద్‌ అలీ జిన్నా సమాధి దగ్గర ఉంటాను. మన కశ్మీరీ సోదరులకు సంఘీభావం ప్రకటించేందుకు నాతో కలవండి. సెప్టెంబర్‌ 6న నేను అమరవీరుల స్వస్థలం సందర్శిస్తాను. త్వరలోనే నియంత్రణ రేఖ దగ్గర పర్యటిస్తాను అని అఫ్రిది బుధవారం ట్వీట్‌ చేశాడు. 

అఫ్రిది ట్వీట్ కి గౌతమ్‌ గంభీర్ ఘాటుగా బదులిచ్చాడు. మిత్రులారా,  షాహిద్‌ అఫ్రిది అవమానం పాలయ్యేందుకు తర్వాత ఏం చేయాలని షాహిద్‌ అఫ్రిదిని అడుగుతున్నాడు. ఎలాంటి సందేహం లేకుండా దీనివల్ల తెలిసిందేమిటంటే షాహిద్‌ అఫ్రిది పరిణతి పొందేందుకు నిరాకరించాడని. అతడికి సాయం చేసేందుకు ఆన్‌లైన్‌ కిండర్‌ గార్టెన్‌ పాఠాలు ఆర్డరిస్తున్నానంటూ గంభీర్ ట్వీట్‌ చేశాడు. 

గంభీర్ ట్వీట్ పై స్పందించిన అఫ్రిది..నేను కలిసి పనిచేసిన వారిలో గౌతమ్‌ గంభీర్‌ది బలహీన మనస్తత్వం. ఎప్పుడూ అభద్రతాభావంతో ఉంటాడని ట్వీట్ చేశాడు. అఫ్రిది ట్వీట్ పై ఇవాళ విలేకరులు గంభీర్ ని ప్రశ్నించగా అఫ్రిదికి బుర్ర పెరగలేదని గంభీర్ సెటైర్లు వేశారు.