South Korea: దక్షిణ కొరియా ఫుట్‌బాల్ స్టార్‌ను నిర్బంధించిన చైనా

గత ఏడాది జరిగిన ఫిఫా ప్రపంచ కప్ లోనూ సన్ జున్-హో దక్షిణ కొరియా తరఫున ఆడాడు. మొత్తం అతడు దక్షిణాఫ్రికా నుంచి 20 అంతర్జాతీయ మ్యాచులు ఆడాడు.

South Korea: దక్షిణ కొరియా ఫుట్‌బాల్ స్టార్‌ను నిర్బంధించిన చైనా

Son Jun-ho

Footballer: దక్షిణ కొరియా ఫుట్‌బాల్ ప్లేయర్‌ను నిర్బంధించింది చైనా (China). ఈ విషయంపై చాలా ఆలస్యంగా అధికారికంగా ప్రకటన చేసింది. సన్ జున్-హో(31)ను చైనా పోలీసులు షాంఘైలోని ఓ ఎయిర్‌పోర్టు వద్ద గత శుక్రవారం అరెస్టుచేసి తీసుకెళ్లారు. అతడిని అవినీతి కేసులో నిర్బంధించినట్లు చైనా చెబుతోంది.

ప్రపంచ కప్ స్టార్ సన్ జున్-హో (Son Jun-ho).. చైనా సూపర్ లీగ్ (Chinese Super League) క్లబ్ షాన్డాంగ్ తైషాన్ ఎఫ్‌సీ తరఫున 2021 నుంచి ఆడుతున్నాడు. అతడు త్వరలోనే విడుదల అవుతారని షాన్డాంగ్ తైషాన్ ఎఫ్‌సీ భావిస్తోంది. చైనా సూపర్ లీగ్ లో ఆడే సన్ జున్-హో ప్రస్తుతం ఈశాన్య లియోనింగ్ ప్రావిన్స్ లో పోలీసుల నిర్బంధంలో ఉన్నాడని చైనా విదేశాంగ శాఖ తెలిపింది.

చైనా ఫుట్‌బాల్ లీగుల్లో మ్యాచ్ ఫిక్సింగ్స్, అవినీతిని అంతమొందించేందుకు ఆ దేశ సర్కారు పలు చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే విచారణ కొనసాగిస్తూ సన్ జున్-హోను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. సన్ జున్-హోపై ఎయే కేసులు పెట్టారన్న విషయంతో పాటు పలు అంశాలపై ఆరా తీయడానికి దక్షిణ కొరియా దౌత్యాధికారులు అతడిని కలవనున్నారు.

చైనా గత మూడు నెలల్లో నలుగురు ఫుట్‌బాల్ లీగుల అధికారులను అరెస్టు చేసింది. 2021లో చైనా సూపర్ లీగ్ క్లబ్ షాన్డాంగ్ తైషాన్ ఎఫ్‌సీ తరఫున సన్ జున్-హో ఆడాడు. ఆ లీగ్ ను ఈ క్లబ్ గెలుచుకుంది. గత ఏడాది జరిగిన ఫిఫా ప్రపంచ కప్ లోనూ సన్ జున్-హో దక్షిణ కొరియా తరఫున ఆడాడు. మొత్తం అతడు దక్షిణాఫ్రికా నుంచి 20 అంతర్జాతీయ మ్యాచులు ఆడాడు.

IPL-2023: అత్యధిక సిక్సులు, ఫోర్లు బాదింది ఎవరు? ఈ జాబితాల్లో కోహ్లీ ఎందుకు లేడు?