Sourav Ganguly: “గంగూలీ రిటైర్మెంట్ అప్పుడే కాదు”

బీసీసీఐ ప్రెసిడెంట్ గా ఉన్న సౌరవ్ గంగూలీ.. బుధవారం చేసిన ట్వీట్ తో రిటైర్మెంట్ ఇచ్చేస్తున్నారంటూ వార్తలు చక్కర్లుకొడుతున్నాయి. ఇవి అవాస్తవం కాదని, ఇప్పుడే రిటైర్మెంట్ ఉండబోదని ప్రముఖ మీడియా వ్యక్తి శుభంకర్ మిశ్రా అంటున్నారు.

Sourav Ganguly: “గంగూలీ రిటైర్మెంట్ అప్పుడే కాదు”

Sourav Ganguly

Sourav Ganguly: బీసీసీఐ ప్రెసిడెంట్ గా ఉన్న సౌరవ్ గంగూలీ.. బుధవారం చేసిన ట్వీట్ తో రిటైర్మెంట్ ఇచ్చేస్తున్నారంటూ వార్తలు చక్కర్లుకొడుతున్నాయి. ఇవి అవాస్తవం కాదని, ఇప్పుడే రిటైర్మెంట్ ఉండబోదని ప్రముఖ మీడియా వ్యక్తి శుభంకర్ మిశ్రా అంటున్నారు. ట్వీట్ లో పేర్కొన్నట్లు ప్రజాసేవ చేయడానికి రాజ్యసభకు వెళ్తుండటం కరెక్ట్ అయి ఉండొచ్చని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

‘దాదా’ సౌరవ్ గంగూలీ ట్వీట్ ప్రకారం… బీసీసీఐని వదిలేసి ఏదో ఒక రాజకీయ పార్టీలో చేరుతున్నాడనేది అవాస్తవం. భవిష్యత్ లో దాదా రాజ్యసభకు వెళ్లే అవకాశం ఉంది. కానీ, ఇప్పుడు అటువంటిదేం లేదు” అంటూ దాదా ట్వీట్ ను రీపోస్ట్ చేశాడు.

తాజాగా గంగూలీ చేసిన ట్వీట్ ఏముందంటే ‘‘ఈ ఏడాదితో క్రికెట్లోకి అడుగుపెట్టి 30 ఏళ్లు అవుతోంది. ఇప్పటివరకు క్రికెట్ నాకు చాలా ఇచ్చింది. అన్నింటికంటే ముఖ్యంగా మీ సహకారం నాకు దొరికింది. ఈ స్థాయికి చేరుకునేందుకు ఇన్నేళ్ల నా ప్రయణంలో నాకు సహకరించిన వాళ్లందరికీ నా ధన్యవాదాలు. చాలా మందికి మేలు చేస్తుందనిపించే కొత్త నిర్ణయాన్ని ఈ రోజు తీసుకోబోతున్నా. ఈ నా కొత్త అధ్యాయానికి కూడా మీ సహకారం ఉంటుందని ఆశిస్తున్నా’’ అంటూ గంగూలీ బుధవారం సాయంత్రం ట్వీట్ చేశాడు.

Read Also: కోహ్లీ.. గంగూలీ లాంటి కెప్టెన్ కాలేకపోయాడు – సెహ్వాగ్