Virat Kohli: కోహ్లీ యాటిట్యూడ్ అంటే ఇష్టం కానీ అది కష్టం – గంగూలీ

టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ.. టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీని పొగుడుతూనే అతనిలోని ఆ క్వాలిటీ తనకు అస్సలు ఇష్టం లేదని అంటున్నాడు. టీ20 కెప్టెన్సీ నుంచి వైదొలిగిన కోహ్లీని..

Virat Kohli: కోహ్లీ యాటిట్యూడ్ అంటే ఇష్టం కానీ అది కష్టం – గంగూలీ

Kohli Gangly

Virat Kohli: టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ.. టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీని పొగుడుతూనే అతనిలోని ఆ క్వాలిటీ తనకు అస్సలు ఇష్టం లేదని అంటున్నాడు. టీ20 కెప్టెన్సీ నుంచి వైదొలిగిన కోహ్లీని వన్డే ఫార్మాట్ కు కెప్టెన్ గా తొలగిస్తూ బీసీసీఐ నిర్ణయాన్ని ప్రకటించింది. దీనిపై కోహ్లీతో చాలా కాలం ముందే బీసీసీఐ చర్చించిందని గంగూలీ అంటుంటే.. తనకు ఓ గంటన్నర ముందు మాత్రమే చెప్పారని కోహ్లీ చేసిన కామెంట్లు చర్చనీయాంశంగా మారాయి. ప్రస్తుత బీసీసీఐ ప్రెసిడెంట్ అయిన గంగూలీ.. ఈ విషయాన్ని వదిలేయమని చెబుతున్నా పదేపదే ఎదురవుతూనే ఉంది.

రీసెంట్ గా గురుగావ్ లో జరిగిన ఈవెంట్ లో గంగూలీని ఏ ప్లేయర్ యాటిట్యూడ్ మీకు బాగా ఇష్టమని అంటే.. తనకు కోహ్లీ యాటిట్యూడ్ చాలా ఇష్టమని కానీ, తాను చాలాసేపు ఫైట్ చేయడం నచ్చదని చెప్పాడు. మీ లైఫ్ లో స్ట్రెస్ ను ఎలా ఎదుర్కొంటారని అడిగిన ప్రశ్నకు.. .జీవితంలో ఒత్తిడి అనేది ఉండదు. భార్య, గర్ల్ ఫ్రెండ్ మాత్రమే వాటిని తెస్తారు’ అని సెటైరికల్ రిప్లై ఇచ్చాడు.

……………………………..: సంక్రాంతికి రావాలా వద్దా.. చర్చిస్తున్న మేకర్స్?

కోహ్లీ ఏం చెప్పాడంటే.. :
. ‘టీ20 కెప్టెన్సీకి రాజీనామా చేయాలని బీసీసీఐని సంప్రదించినప్పుడు నేనేం అనుకుంటున్నానో చెప్పాను. కారణాలు వారి ముందుంచాను. వాటిని సానుకూలంగానే తీసుకున్నారు. ఎవరూ వాటికి అభ్యంతరం చెప్పలేదు. టీ20 కెప్టెన్సీ వదలొద్దని కూడా అడ్డుకోలేదు’ అని కోహ్లీ అన్నాడు.

‘కొందరేమో అగ్రెసివ్ అయినప్పటికీ కరెక్ట్ నిర్ణయం తీసుకున్నానని అన్నారు. అదే సమయంలో వన్డేకు, టెస్టు ఫార్మాట్లకు కెప్టెన్ గా ఉంటానని బీసీసీఐకి అప్పుడే చెప్పా. ఇదంతా ఫోన్ కాల్ లోనే క్లారిటీ ఇచ్చా. బీసీసీఐతో నా కమ్యూనికేషన్ చాలా క్లియర్ గా ఉంది. దీనిపై బీసీసీఐ ఆఫీస్ బేరర్స్ వేరేదైనా నిర్ణయం తీసుకున్నా నాకు సమ్మతమే’ అని కూడా చెప్పానని’ విరాట్ వివరించాడు.

……………………………….. : చలికాలంలో శ్వాస సమస్యలకు ఉపకరించే వాము…