Sourav Ganguly: రిషభ్ పంత్ మళ్లీ టీమిండియాలో చేరే అవకాశాలు ఉన్నాయి: గంగూలీ

రిషభ్ పంత్ఐ పీఎల్-2023లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో రిషభ్ పంత్ లేకపోవడంతో అతడిని జట్టులోని ప్రతి ఒక్కరూ మిస్ అవుతున్నారని గంగూలీ అన్నారు. త్వరలోనే తాను పంత్ వద్దకు వెళ్లి కలుస్తానని చెప్పారు.

Sourav Ganguly: టీమిండియా ఆటగాడు రిషభ్ పంత్ ప్రత్యేక ప్లేయర్ అని, పూర్తిగా కోలుకునేందుకు కావాల్సినంత సమయాన్ని తప్పకుండా తీసుకోవాలని ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ డైరెక్టర్ సౌరవ్ గంగూలీ అన్నారు. భవిష్యత్తుల్లో మళ్లీ టీమిండియాలో కనపడే అవకాశాలు ఉన్నాయని చెప్పారు.

రిషభ్ పంత్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడడంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్-2023లో అతడి స్థానంలో సారథ్య బాధ్యతలను ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ కు అప్పగిస్తున్నట్లు ఇటీవల ఢిల్లీ క్యాపిటల్స్ ప్రకటించింది. ఐపీఎల్-2022లో ఢిల్లీ క్యాపిటల్స్ కు రిషభ్ పంత్ సారథ్యం వహించాడు. కారు ప్రమాదం నుంచి ఇప్పటికీ కోలుకోకపోవడంతో ఐపీఎల్-2023కు రిషభ్ పంత్ దూరమయ్యాడు. దీనిపై గంగూలీ స్పందించారు.

రిషభ్ పంత్ఐ పీఎల్-2023లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో రిషభ్ పంత్ లేకపోవడంతో అతడిని జట్టులోని ప్రతి ఒక్కరూ మిస్ అవుతున్నారని గంగూలీ అన్నారు. త్వరలోనే తాను పంత్ వద్దకు వెళ్లి కలుస్తానని చెప్పారు. పంత్ వయసు తక్కువేనని, అతడు భవిష్యత్తులో మళ్లీ టీమిండియా జట్టుకు వచ్చే అవకాశాలు ఉన్నాయని అన్నారు.

అతడినా జాతీయ జట్టు కూడా మిస్ అవుతుందని చెప్పారు. అతడు తర్వగా కోలుకోవాలని తాము కోరుకుంటున్నామని తెలిపారు. బీసీసీఐ అధ్యక్షుడి పదవి నుంచి దిగిపోయాక గంగూలీ మళ్లీ ఢిల్లీ క్యాపిటల్స్ డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు. ఆ జట్టు కుర్రాళ్లతో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నానని అన్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్ రికీ పాంటింగ్ సమక్షంలో ప్లేయర్లు నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తున్నారని చెప్పారు.

IPL 2023-David Warner: ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ గా రిషభ్ పంత్ స్థానంలో డేవిడ్ వార్నర్

ట్రెండింగ్ వార్తలు