Sourav Ganguly: రిషబ్ పంత్ రీ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన సౌరవ్ గంగూలీ.. పంత్ ఎప్పుడు తిరిగొస్తాడంటే

పంత్ భారత జట్టులోకి తిరిగి ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడు అనే అంశంపై క్రీడాభిమానుల్లో సందేహం నెలకొంది. ఈ అంశంపై బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, ఢిల్లీ క్యాపిటల్స్ డైరెక్టర్ సౌరవ్ గంగూలీ కీలక వివరాల్ని వెల్లడించారు. తాను ఈ విషయంపై పంత్‌తో మాట్లాడినట్లు చెప్పాడు.

Sourav Ganguly: రిషబ్ పంత్ రీ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన సౌరవ్ గంగూలీ.. పంత్ ఎప్పుడు తిరిగొస్తాడంటే

Sourav Ganguly: రెండు నెలల క్రితం గాయపడ్డ భారత యువ క్రికెటర్ రిషబ్ పంత్ ప్రస్తుతం నెమ్మదిగా కోలుకుంటున్న సంగతి తెలిసిందే. గాయాలు, శస్త్ర చికిత్సల వల్ల అతడు మరింతకాలం విశ్రాంతి తీసుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో పంత్ భారత జట్టులోకి తిరిగి ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడు అనే అంశంపై క్రీడాభిమానుల్లో సందేహం నెలకొంది.

Ayyanna Patrudu: సుప్రీం కోర్టులో టీడీపీ నేత అయ్యన్న పాత్రుడుకు ఎదురుదెబ్బ.. ఫోర్జరీ కేసు విచారణకు అనుమతి

ఈ అంశంపై బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, ఢిల్లీ క్యాపిటల్స్ డైరెక్టర్ సౌరవ్ గంగూలీ కీలక వివరాల్ని వెల్లడించారు. తాను ఈ విషయంపై పంత్‌తో మాట్లాడినట్లు చెప్పాడు. ‘‘నేను పంత్‌తో మాట్లాడాను. అతడు గాయాలు, సర్జరీల వల్ల క్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నట్లు చెప్పాడు. అతడు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నా. ప్రస్తుతం ఉన్న పరిస్థితిని బట్టి ఏడాది లేదా రెండేళ్ల తర్వాతే అతడు టీమిండియాకు తిరిగి ఆడే అవకాశం ఉంది’’ అని చెప్పాడు. దీంతో మరో ఏడాది లేదా రెండేళ్ల వరకు పంత్ జట్టులోకి తిరిగి రాకపోవచ్చని స్పష్టమైంది. మరోవైపు పంత్ కెప్టెన్‌గా ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్‌కు మరో ఆటగాడిని అతడి స్థానంలో ఎంపిక చేసే అవకాశం ఉంది.

Dangerous Man: ముంబైలో అడుగుపెట్టిన ‘కిరాతకుడు’.. అప్రమత్తంగా ఉండాలంటూ ఎన్ఐఏ హెచ్చరిక

‘‘పంత్ స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్‌కు మరో ఆటగాడిని ఎంపిక చేయాల్సి ఉంది. సరైన ఆటగాడిని ఎంపిక చేసేందుకు కొంత సమయం కావాలి. రాబోయే ఐపీఎల్ కంటే ముందే తర్వాతి క్యాంప్ ప్రారంభమవుతుంది. ఐపీఎల్‌కు మరో నెల మాత్రమే ఉంది. అందరు ఆటగాళ్లు జట్టులో చేరడం కష్టంగా ఉంది. కొందరు ఇరానీ ట్రోఫీలో ఆడుతున్నారు. సర్ఫరాజ్ గాయపడ్డాడు. అయితే, అతడు ఐపీఎల్‌లో ఆడొచ్చు’’ అని గంగూలీ వ్యాఖ్యానించాడు. ఏదేమైనా ప్రస్తుతం గాయాల కారణంగా ఈ ఏడాది జరగబోయే ఆసియా కప్, ప్రపంచ కప్‌లో పంత్ ఆడే అవకాశాలు లేవు.