Saurav Ganguly: సౌరవ్ గంగూలీకి కరోనా పాజిటివ్.. ఆసుపత్రిలో చేరిన దాదా!

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి కరోనా సోకింది.

Saurav Ganguly: సౌరవ్ గంగూలీకి కరోనా పాజిటివ్.. ఆసుపత్రిలో చేరిన దాదా!

Ganguly

Saurav Ganguly Corona Positive: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి కరోనా సోకింది. కరోనా పాజిటివ్ వచ్చిన తర్వాత గంగూలీని కోల్‌కతాలోని వుడ్‌ల్యాండ్స్ ఆసుపత్రిలో చేర్చారు.

సౌరవ్ గంగూలీ సోమవారం టెస్ట్ చేయించుకోగా.. కరోనా రిపోర్టు పాజిటివ్‌గా వచ్చింది. గంగూలీ కుటుంబ సభ్యులకు కొన్ని నెలల క్రితం కరోనా రాగా.. ఆ సమయంలో గంగూలీ ఐసోలేషన్‌లో ఉన్నారు.

భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఈ ఏడాది ప్రారంభంలో కూడా ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. ఛాతిలో నొప్పి రావడంతో అప్పట్లో ఆస్పత్రిలో చేరారు. గంగూలీ యాంజియోప్లాస్టీ చేయించుకున్నాడు.

ఈ ఏడాది జనవరి 2న సౌరవ్ గంగూలీ ఛాతీలో నొప్పి రావడంతో కోల్‌కతాలోని వుడ్‌ల్యాండ్స్ ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకున్నాడు. అక్కడే యాంజియోప్లాస్టీ చేయించుకున్నాడు.

అప్పట్లో ఇంట్లో జిమ్‌లో ట్రెడ్‌మిల్ చేస్తుండగా.. ఛాతీ నొప్పి వచ్చింది. సౌరవ్ గంగూలీ తర్వాత, అతని అన్నయ్య స్నేహాశిష్ గంగూలీ కూడా యాంజియోప్లాస్టీ చేయించుకున్నాడు.