SA Vs Ind : టీమిండియా టార్గెట్ 297.. సెంచరీలతో కదం తొక్కిన బవుమా, డ్రస్సెన్

వీరిద్దరీ సెంచరీలతో స్కోరు బోర్డు పరుగులెత్తింది. వీరిని అవుట్ చేయడానికి భారత బౌలర్లు శ్రమించారు. కానీ వారికి మాత్రం ఎలాంటి ఛాన్స్ ఇవ్వలేదు...

SA Vs Ind : టీమిండియా టార్గెట్ 297.. సెంచరీలతో కదం తొక్కిన బవుమా, డ్రస్సెన్

Sa

South africa And Team India : టీమిండియా ఎదుట సౌతాఫ్రికా భారీ టార్గెట్ ను విధించింది. ఇప్పటికే టెస్టు సిరీస్‌లో ఓడిపోయిన టీమిండియా వ‌న్డే సిరీస్‌ను ఎలాగైనా గెల‌వాల‌ని ప‌ట్టుద‌ల‌గా ఉంది. అయితే..టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన సౌతాఫ్రికా ప్లేయర్స్ రెచ్చిపోయారు. ప్రధానంగా జట్టు కెప్టెన్ బవుమా సెంచరీతో కదం తొక్కాడు. డస్సేన్ కూడా వంద పరుగులు చేశాడు. వీరిద్దరీ సెంచరీలతో స్కోరు బోర్డు పరుగులెత్తింది. వీరిని అవుట్ చేయడానికి భారత బౌలర్లు శ్రమించారు. కానీ వారికి మాత్రం ఎలాంటి ఛాన్స్ ఇవ్వలేదు. నిర్ణీత 50 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 296 పరుగులు చేసింది.

Read More : AP PRC : త్వరలో సమ్మెలోకి ఉద్యోగులు ? చర్చలు లేవ్..ఇక కార్యాచరణే

తొలుత టాస్ గెలిచిన సౌతాఫ్రికా ఏ మాత్రం ఆలోచించకుండా బ్యాటింగ్ ఎంచుకుంది. మలన్ 6 పరుగులు చేసి బుమ్రా బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. డికాక్ కు కెప్టెన్ బవుమా జత కలిశాడు. వచ్చి రాగానే బ్యాట్ కు పని చెప్పాడు. గతి తప్పిన బంతులను బౌండరీలకు తరలించాడు. సింగిల్స్ తీస్తూ..భారత బౌలర్లపై ఒత్తిడి పెంచాడు. జట్టు స్కోరు 58 పరుగుల వద్ద ఉన్నప్పుడు డికాక్ (27) అవుట్ అయ్యాడు. మార్ క్రమ్ 4 రన్ల వద్ద రన్ అవుట్ అయ్యాడు. ఓ వైపు బువుమా మరోవైపు డస్సేన్ లు రాణించడంతో భారీ స్కోరు దాటుతుందని అంచనా వేశారు.

Read More : Chandra babu Covid positive: కరోనా సోకిన చంద్రబాబు త్వరగా కోలుకోవాలి : చైనా రాయబారి లెటర్

జట్టు స్కోరు 68 రన్ల వద్ద పడి పోయిన వికెట్ (3 వికెట్లు)…272 పరుగుల వద్ద వికెట్ పడిపోయిందంటే..వారు ఎలా ఆడారో అర్థం చేసుకోవచ్చు. 272 రన్ల వద్ద ఉన్నప్పుడు 143 బంతులను ఎదుర్కొని 110 పరుగులు చేసిన బవుమా ను బుమ్రా అవుట్ చేశాడు. డస్సేన్ కేవలం 94 బంతులను ఎదుర్కొని 124 పరుగులు చేశాడు. నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 296 పరుగులు చేసింది. మరి టీమిండియా ఈ టార్గెట్ ను చేధిస్తుందా ? లేదా ? అనేది చూడాలి. భారత బౌలర్లలో బుమ్రా రెండు, అశ్విన్ ఒక వికెట్ తీశారు.

టీమిండియా జట్టు : కేఎల్ రాహుల్ (కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్, వెంకటేశ్ అయ్యర్, శార్దూర్ ఠాకూర్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్, జస్ప్రీత్ బుమ్రా, యుజ్వేంద్ర చాహల్

దక్షిణాఫ్రికా జట్టు : క్వింటన్ డి కాక్, జానెమన్ మలన్, తెంబా బవుమా, మార్ క్రమ్, రస్సీ వాండర్ డస్సెన్, డేవిడ్ మిల్లర్, పెహ్లుక్వాయో, మార్కో జాన్సన్, కేశవ్ మహరాజ్, లుంగి ఎంగిడి, తబ్రెయిజ్ షంసి.