India Tour Of South Africa: ఒమిక్రాన్ ప్రభావం టీ20 సిరీస్ వాయిదా.. సౌతాఫ్రికా షెడ్యూల్‌ ఇదే!

ఓమిక్రాన్ వేరియంట్‌ ప్రభావంతో భారత్‌తో జరిగాల్సిన సిరీస్‌ షెడ్యూల్‌ని సవరించింది క్రికెట్ సౌతాఫ్రికా.

India Tour Of South Africa: ఒమిక్రాన్ ప్రభావం టీ20 సిరీస్ వాయిదా.. సౌతాఫ్రికా షెడ్యూల్‌ ఇదే!

India (1)

India Tour Of South Africa: ఓమిక్రాన్ వేరియంట్‌ ప్రభావంతో భారత్‌తో జరిగాల్సిన సిరీస్‌ షెడ్యూల్‌ని సవరించింది క్రికెట్ సౌతాఫ్రికా. ఇంతకుముందు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం.. డిసెంబర్ 17వ తేదీ నుంచి భారత్ దక్షిణాఫ్రికా పర్యటన ప్రారంభం కావల్సి ఉండగా.. ఇప్పుడు కొత్త షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 26వ తేదీ నుంచి భారత్ దక్షిణాఫ్రికా పర్యటన ప్రారంభం కాబోతుంది.

దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు విడుదల చేసిన కొత్త షెడ్యూల్ ప్రకారం దక్షిణాఫ్రికా పర్యటనలో భారత జట్టు మూడు టెస్టులు, మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. డిసెంబర్ 26 నుంచి బాక్సింగ్ డే టెస్టుతో టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటన ప్రారంభం కానుంది. సెంచూరియన్‌లోని సూపర్‌స్పోర్ట్ పార్క్‌లో ఈ మ్యాచ్ జరగనుంది.

భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో టెస్టు 2022 జనవరి 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకు జోహన్నెస్‌బర్గ్‌లో జరగనుంది. మూడోది, చివరి టెస్టు 2022 జనవరి 1 నుంచి 15 వరకు కేప్‌టౌన్‌లోని న్యూలాండ్స్‌లో జరగనుంది. టెస్టు సిరీస్ తర్వాత ఇరు జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ జరగనుంది. వన్డే సిరీస్‌లో తొలి మ్యాచ్‌ జనవరి 19న, రెండో మ్యాచ్‌ జనవరి 21న, మూడోది, చివరి మ్యాచ్‌ జనవరి 23న జరగనుంది.

Numerology 2022: మీ పుట్టిన తేదీ సంఖ్య ఇదేనా? 2022 మీకు అదృష్టమే.. బాగా డబ్బు సంపాదిస్తారు

అంతకుముందు డిసెంబర్ 17 నుంచి భారత్ దక్షిణాఫ్రికా పర్యటన ప్రారంభం కావల్సి ఉండగా.. అనుకున్న టైమ్‌కి మ్యాచ్‌లు స్టార్ట్ అయ్యి ఉంటే, మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరిగేది. అయితే ఇప్పుడు టీ20 సిరీస్ వాయిదా పడింది. ఈ టూర్‌లో టీమిండియా టెస్టు, వన్డే సిరీస్‌లు మాత్రమే ఆడనుంది.

టెస్ట్ సిరీస్ షెడ్యూల్:
1వ టెస్ట్ – డిసెంబర్ 26-30, సెంచూరియన్
2వ టెస్ట్ – జనవరి 3-7, జోహన్నెస్‌బర్గ్
3వ టెస్ట్ – 11-15 జనవరి, కేప్‌టౌన్

వన్డే సిరీస్ షెడ్యూల్:
1వ వన్డే – జనవరి 19, పార్ల్.
2వ వన్డే – జనవరి 21, పార్ల్.
3వ వన్డే – జనవరి 23, కేప్ టౌన్.