IND vs SA: మాదే తప్పు.. అవకాశాలు వాడుకోలేకపోయాం – కోహ్లీ

దక్షిణాఫ్రికాతో జరిగిన నిర్ణయాత్మక మూడో టెస్టులో భారత్ పరాజయం మూటగట్టుకుంది. 1-1తో ఉన్న దశలో మూడో మ్యాచ్ ను ఏడు వికెట్ల తేడాతో ఓడిపోవడంతో దక్షిణాఫ్రికాను విజయం వరించింది.

IND vs SA: మాదే తప్పు.. అవకాశాలు వాడుకోలేకపోయాం – కోహ్లీ

Virat Kohli (2)

IND vs SA: దక్షిణాఫ్రికాతో జరిగిన నిర్ణయాత్మక మూడో టెస్టులో భారత్ పరాజయం మూటగట్టుకుంది. 1-1తో ఉన్న దశలో మూడో మ్యాచ్ ను ఏడు వికెట్ల తేడాతో ఓడిపోవడంతో దక్షిణాఫ్రికాను విజయం వరించింది. శుక్రవారం విజయం సాధించి 2-1తో చిరస్మరణీయమైన సిరీస్‌ను కైవసం చేసుకుంది.

టీమిండియా నిర్ధేశించిన 212 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి సునాయాసంగా ఛేదించింది. పీటర్సన్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌తో పాటు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు దక్కాయి.

మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో దక్షిణాఫ్రికా ఏడు వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది. మూడో టెస్టులోని కీలక సమయాల్లో వచ్చిన అవకాశాలను సద్వినియోగపరచుకోవడంలో టీమిండియా విఫలమైందని భారత టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. మ్యాచ్ అనంతరం విలేకరుల సమావేశంలో విరాట్ కోహ్లీ మాట్లాడుతూ, కొన్ని సెషన్లలో భారత్ చాలా వికెట్లు కోల్పోయిందని చెప్పాడు.

ఇది కూడా చదవండి : కేప్‌టౌన్ టెస్టులో భారత్ ఓటమి.. సిరీస్ సౌతాఫ్రికా వశం

“ఇది సమిష్టి బాధ్యత. దొరికిన అవకాశాలు సద్వినియోగపరచుకోలేకపోయాం. మా బౌలింగ్ వారి కంటే భిన్నంగా ఉంది. ఈ పిచ్‌లపై వాళ్లకు అనుభవం ఉంది. ఎలా ఆడాలో వారికి తెలుసు. మా బలాలపై దృష్టి పెట్టడానికి ప్రయత్నించాం కానీ సక్సెస్ కాలేదు” అని కోహ్లీ చెప్పాడు.

మూడో టెస్టులో వికెట్ కీపర్ రిషబ్ పంత్ సెంచరీ చేసినందుకు కెప్టెన్ ప్రశంసలు కురిపించాడు. “పొరపాట్లు జరుగుతాయి కానీ దాని నుంచే నేర్చుకున్నాడు. ఒక ప్రత్యేక టాలెంట్ తో ఆడాడు” అని కోహ్లీ చెప్పాడు.

జట్టులో మార్పులు వస్తాయా అని అడిగిన దానికి ఎలాంటి మార్పులు వస్తాయో ఇప్పుడే చెప్పలేనని.. అయితే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని అన్నాడు.

ఇది కూడా చదవండి: యూట్యూబ్ లో 10 బిలియన్ వ్యూస్ తో “బేబీ షార్క్” సెన్సేషన్