Budget 2023: క్రీడారంగానికి పెద్దపీట వేసిన బడ్జెట్.. గతంకంటే ఎక్కువ కేటాయింపులు
2023-24 ఆర్థిక సంవత్సరానికిగాను క్రీడారంగానికి రూ.3,397 కోట్లు కేటాయిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇది క్రీడా రంగం అభివృద్ధికి, క్రీడాకారులకు మేలు కలిగిస్తుంది. రాబోయే ఆసియా గేమ్స్, వచ్చే ఏడాది జరగబోయే ఒలంపిక్స్‌లో మరింతగా రాణించేందుకు ఈ నిధుల కేటాయింపు ఉపయోగపడుతుంది.

Budget 2023: ఈ ఏడాదికి సంబంధించి పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కేంద్రం క్రీడారంగానికి భారీ నిధులు కేటాయించింది. గతంలోకంటే ఎక్కువ నిధుల్ని కేటాయిస్తున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. గత ఏడాదికంటే ఈ సారి అదనంగా రూ.300 కోట్లు అదనంగా కేటాయించారు.
#Budget2023: కేంద్ర బడ్జెట్-2023లోని 7 లక్ష్యాలు.. సప్తర్షిగా వర్ణించిన ఆర్థికమంత్రి నిర్మల
2023-24 ఆర్థిక సంవత్సరానికిగాను క్రీడారంగానికి రూ.3,397 కోట్లు కేటాయిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇది క్రీడా రంగం అభివృద్ధికి, క్రీడాకారులకు మేలు కలిగిస్తుంది. రాబోయే ఆసియా గేమ్స్, వచ్చే ఏడాది జరగబోయే ఒలంపిక్స్‌లో మరింతగా రాణించేందుకు ఈ నిధుల కేటాయింపు ఉపయోగపడుతుంది. ఒలంపిక్స్‌కు క్రీడాకారులు సన్నద్ధమయ్యేందుకు అవసరమైన శిక్షణ, మౌలిక వసతుల కోసం నిధులు ఉపయోగపడతాయి. ఈ క్రీడా బడ్జెట్ ద్వారా శాయ్ (స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా)కు కూడా గత ఏడాదికంటే అదనపు నిధులు అందనున్నాయి. రూ.132.52 కోట్లను ఈ సారి అదనంగా కేటాయించారు.
Telangana: తెలంగాణలో ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమం ప్రారంభం.. గంభీరావుపేటలో ప్రారంభించిన మంత్రి కేటీఆర్
మొత్తంగా శాయ్‌కు ఈసారి రూ.1045 కోట్లను కేటాయించింది కేంద్రం. మిగతా క్రీడా విభాగాలకు సంబంధించి నేషనల్ స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ ఫండ్ కింద రూ.15 కోట్లు, నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్‌కు రూ.325 కోట్లు, నేషనల్ సర్వీస్ గేమ్స్‌కు మరో రూ.325 కోట్లు కేటాయించింది. ‘ఖేలో ఇండియా యూత్ గేమ్స్’కు రూ.1045 కోట్లు కేటాయించారు. నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీకి రూ.100 కోట్ల వరకు నిధులు అందనున్నాయి. మొత్తంగా ఈ బడ్జెట్‌లో క్రీడా రంగానికి గతంలో కంటే ఎక్కువ కేటాయింపులు ఉండటం విశేషం.