Hima Das : స్పింటర్‌ హిమాదాస్‌కు కరోనా

పటియాలాలో నిర్వహిస్తున్న జాతీయ క్యాంప్‌నకు హాజరయ్యేందుకు వచ్చిన హిమాదాస్‌కు కొవిడ్‌-19 పరీక్షలు నిర్వహించగా కరోనా సోకినట్లు తేలింది.

Hima Das : స్పింటర్‌ హిమాదాస్‌కు కరోనా

Hima Das

Hima Das :  భారత స్టార్‌ స్పింటర్‌ హిమాదాస్‌ కరోనా బారినపడ్డారు. పటియాలాలో నిర్వహిస్తున్న జాతీయ క్యాంప్‌నకు హాజరయ్యేందుకు వచ్చిన హిమాదాస్‌కు కొవిడ్‌-19 పరీక్షలు నిర్వహించగా కరోనా సోకినట్లు తేలింది. అయితే ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని, ఐసొలేషన్‌లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. హిమాదాస్‌ లో కరోనా లక్షణాలు ఏమి లేవని వైద్యులు తెలిపారు.

చదవండి : IPL 2021 : ఉత్కంఠభరిత పోరులో కోల్‌కతాదే విజయం

కరోనా విషయంపై హిమదాస్ స్పందించారు. ‘కరోనా బారిన పడ్డాను. ప్రస్తుతం ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు. ఈ ఖాళీ సమయాన్ని సద్వినియోగ పరుచుకొని మునుపటి కంటే దృఢంగా తిరిగివస్తా’ అని బుధవారం ట్వీట్ చేసింది. కాగా ఇటీవల కండరాళ్ళ గాయం నుంచి కోలుకొని తిరిగి ట్రాక్‌పై అడుగుపెట్టారు హిమదాస్

చదవండి : Kerala’s Covid Cases : కేరళలో మళ్లీ పెరిగిన కోవిడ్ కేసులు