ఏం మారలేదు: ఏడేళ్ల తర్వాత రీ-ఎంట్రీ.. ఫస్ట్ మ్యాచ్‌లోనే స్లెడ్జింగ్!

ఏం మారలేదు: ఏడేళ్ల తర్వాత రీ-ఎంట్రీ.. ఫస్ట్ మ్యాచ్‌లోనే స్లెడ్జింగ్!

భారత క్రికెట్ ఆటగాళ్లలో అగ్రెసివ్ ఆటగాడు శ్రీశాంత్ ఏడేళ్ల తర్వాత గ్రౌండ్‌లోకి అడుగుపెట్టి బంతి పట్టాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో భాగంగా.. భారత వెటరన్ ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్ కేరళ కోసం మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టాడు. జనవరి 10వ తేదీ నుంచి సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీ సాగబోతుండగా.. కేరళ టీమ్‌కి ఎంపికయ్యారు పేసర్ శ్రీశాంత్.

రీఎంట్రీ మ్యాచ్‌లోనే కేరళ టీమ్‌లోని సహచర బ్యాట్స్‌మెన్‌పై స్లెడ్జింగ్‌కి దిగడమే కాదు.. మునుపటి తన ఫామ్‌ను కూడా ఏ మాత్రం కోల్పోలేదు శ్రీశాంత్. 2013 ఐపీఎల్‌లో స్ఫాట్‌ ఫిక్సింగ్‌కి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొని శ్రీశాంత్‌ లైఫ్ టైమ్ బ్యాన్‌కు గురయ్యారు. తర్వాత అనేకమార్లు కోర్టు మెట్లు ఎక్కిదిగిన తర్వాత.. ఏడేళ్ల నిషేదానికి దిగి వచ్చారు. గత ఏడాది సెప్టెంబరుతో ఈ నిషేదం ముగియగా.. కేరళ తరఫున మళ్లీ దేశవాళీ క్రికెట్‌లో ఆడేందుకు అతనికి అవకాశం దక్కింది.

సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలో 37 ఏళ్ల శ్రీశాంత్ సత్తాచాటితే ఐపీఎల్ 2021లో మళ్లీ అతనికి ఆడే అవకాశం దక్కవచ్చు. 2013లో చివరిగా అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన శ్రీశాంత్.. ఆ తర్వాత మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టలేదు. నిషేధం కారణంగా కనీసం స్టేడియంలోని సౌకర్యాలను వాడుకునే అవకాశం కూడా లభించలేదు. లేటెస్ట్‌గా నిషేదం పూర్తయ్యాక.. కేరళ టీమ్ మేనేజ్‌మెంట్ నుంచి మ్యాచ్ క్యాప్ అందుకుని ఎమోషనల్ అయ్యాడు శ్రీశాంత్.

శ్రీశాంత్ టీమిండియా తరఫున 27 టెస్టులు, 53 వన్డేలు, 10 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. శ్రీశాంత్ తన కెరీర్‍‌లో మొత్తం 169 వికెట్లు పడగొట్టాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలో కేరళ జట్టుకి సంజు శాంసన్ కెప్టెన్‌గా ఉన్నారు.