SRHvDC: హైదరాబాద్ టార్గెట్ 130

SRHvDC: హైదరాబాద్ టార్గెట్ 130

సన్  రైజర్స్ ధాటికి ఢిల్లీ క్రీజులో నిలిచేందుకే నానా తంటాలు పడాల్సి వచ్చింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న హైదరాబాద్ ఢిల్లీకి ముచ్చెమటలు పోయించింది. ఈ క్రమంలో 8 వికెట్లు నష్టపోయిన ఢిల్లీ.. హైదరాబాద్ కి 130 పరుగుల టార్గెట్ నిర్దేశించింది.

టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ ఆరంభం నుంచి తడబడుతూనే బ్యాటింగ్ కొనసాగించింది. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్(43; 41 బంతుల్లో 3 ఫోర్లు 1 సిక్సు), పృథ్వీ షా(11), శిఖర్ ధావన్(12), రిషబ్ పంత్(5), తెవాటియా(5), ఇన్ గ్రామ్(5), క్రిస్ మోరిస్(17), అక్సర్(23), రబాడ(3), ఇషాంత్(0) పరుగులు చేయగలిగారు.

 

భువనేశ్వర్ కుమార్, నబీ, సిద్ధార్థ్ కౌల్ ఒక్కొక్కరు 3 వికెట్లు తీయగా రషీద్ ఖాన్, సందీప్ శర్మలు ఒక్కో వికెట్ తీయగలిగారు.