IND Vs SL 2023: టీమిండియాతో టీ20, వన్డే సరీస్‌లకు జట్టును ప్రకటించిన శ్రీలంక

టీమిండియా వర్సెస్ శ్రీలంక జట్ల మధ్య వచ్చే నెల 3 నుంచి 15 వరకు మ్యాచ్‌లు జరుగుతాయి. 3, 5, 7 తేదీల్లో టీ20 మ్యాచ్ లు జరగనుండగా, 10, 12, 15 తేదీల్లో వన్డే మ్యాచ్‌లు జరుగుతాయి. అయితే మొత్తం 20 మంది ఆటగాళ్లకు ఎంపిక చేసిన శ్రీలంక బోర్డు..

IND Vs SL 2023: టీమిండియాతో టీ20, వన్డే సరీస్‌లకు జట్టును ప్రకటించిన శ్రీలంక

India vs Sri Lanka

IND Vs SL 2023: శ్రీలంక జట్టు భారత్‌లో పర్యటించనుంది. 2023 జనవరి 3 నుంచి ఇండియాలో టీ20, వన్డే సిరీస్‌లు ఆడనుంది. ఇప్పటికే రెండు సిరీస్‌లకు భారత్ జట్టును బీసీసీఐ ప్రకటించింది. తాజాగా శ్రీలంక క్రికెట్ బోర్డు జట్టును ప్రకటించింది. టీ20, వన్డే సిరీస్‌లకు కెప్టెన్‌గా దసున్ షనక వ్యవహరించనున్నారు. టీ20 సిరీస్‌కు వైస్ కెప్టెన్‌గా వనిందు హసరంగ, వన్డేలకు వైస్ కెప్టెన్‌గా కుశాల్ మెండిస్‌లు వ్యవహరించనున్నారు.

BAN vs IND 1st Test: బంగ్లా బ్యాటర్లకు చుక్కలు చూపించిన సిరాజ్… పెవిలియన్ బాటపట్టిన కీలక ఆటగాళ్లు

టీమిండియా వర్సెస్ శ్రీలంక జట్ల మధ్య వచ్చే నెల 3 నుంచి 15 వరకు మ్యాచ్‌లు జరుగుతాయి. 3, 5, 7 తేదీల్లో టీ20 మ్యాచ్ లు జరగనుండగా, 10, 12, 15 తేదీల్లో వన్డే మ్యాచ్‌లు జరుగుతాయి. అయితే మొత్తం 20 మంది ఆటగాళ్లకు ఎంపిక చేసిన శ్రీలంక బోర్డు.. వారిలో భానుక రాజపక్స, తుషారలు కేవలం టీ20 సిరీస్ లో మాత్రమే ఆడతారు. వండెర్సే, నువానిడు ఫెర్నాండో వన్డేలకు మాత్రమే ఆడతారు.

India Squad For Sri Lanka: శ్రీలంకతో టీ20, వన్డే సిరీస్‌లకు జట్టును ప్రకటించిన బీసీసీఐ.. కీలక మార్పులు ఏమిటంటే?

శ్రీలంక జట్టు వివరాలు..
దసున్ షనక (కెప్టెన్), పాతుమ్ నిసాంక, అవిష్క ఫెర్నాండో, సదీర సమరవిక్రమ, కుశాల్ మెండిస్ (వన్డేలకు వైస్‌ కెప్టెన్‌), చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, వనిందు హసరంగ (టీ20 వైస్‌ కెప్టెన్‌), ఆషేన్‌ బండార, మహీశ్‌ తీక్షణ, జెఫ్రీ వాండర్సే (వన్డేలకు మాత్రమే), చమికా కరుణరత్నే, దిల్షాన్ మధుశంక, కసున్ రజిత, నువానీదు ఫెర్నాండో (వన్డేలకు మాత్రమే), దునిత్ వెల్లలగే, ప్రమోద్ మధుషన్, లాహిరు కుమార, నువాన్ తుషార (టీ20లకు మాత్రమే)