SL vs IND : లంక విక్టరీ, భారత్‌పై 4 వికెట్ల తేడాతో శ్రీలంక గెలుపు..సిరీస్‌ 1-1తో సమం

కొలంబో వేదికగా జరుగుతున్న టీ20లో భారత్‌పై శ్రీలంక పైచేయి సాధించింది. ఉత్కంఠగా జరిగిన మ్యాచ్‌లో.. భారత్‌పై నాలుగు వికెట్ల తేడాతో లంకేయులు విజయం సాధించారు. 19 పాయింట్ 4 ఓవర్లలో శ్రీలంక 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

SL vs IND : లంక విక్టరీ, భారత్‌పై 4 వికెట్ల తేడాతో శ్రీలంక గెలుపు..సిరీస్‌ 1-1తో సమం

Srilanka

Sri Lanka Won By 4 Wickets : కొలంబో వేదికగా జరుగుతున్న టీ20లో భారత్‌పై శ్రీలంక పైచేయి సాధించింది. ఉత్కంఠగా జరిగిన మ్యాచ్‌లో.. భారత్‌పై నాలుగు వికెట్ల తేడాతో లంకేయులు విజయం సాధించారు. 19 పాయింట్ 4 ఓవర్లలో శ్రీలంక 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో మూడు టీ20ల సిరీస్‌లో ఇరు జట్లు ఒకటి ఒకటితో.. సమంగా నిలిచాయి. అయితే టీమ్‌ఇండియా నిర్దేశించిన 133 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి లంక జట్టు చెమటోడ్చాల్సి వచ్చింది.

Read More : Munugode : మునుగోడు పాలిటిక్స్, ఎవరి జోలికి వెళ్లలేదు..ఎక్కువ మాట్లాడితే బట్టలు విప్పుతా

తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. కెప్టెన్‌ ధావన్‌, పడిక్కల్‌ మినహా మిగతా వారు విఫలమయ్యారు. దీంతో భారత్‌ శ్రీలంక ఎదుట స్వల్ప లక్ష్యాన్ని ఉంచగలిగింది. శ్రీలంక జట్టులో ధనంజయ 2 వికెట్లు తీశాడు. 133 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకకు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. జట్టు స్కోరు 12 పరుగులు ఉన్నప్పుడు ఓపెనర్‌ అవిష్క ఫెర్నాండోను భువీ వెనక్కి పంపాడు.

Read More : Vizag : ఉక్కుపోరాటం, వెనక్కి తగ్గని కేంద్రం..అడ్డుకుంటామంటున్న కమిటీ

దీంతో శ్రీలంక కష్టాల్లో పడింది. అయితే మరో ఓపెనర్‌ మినోద్‌ భానుక, సమర విక్రమతో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. భానుకను కుల్‌దీప్‌ యాదవ్‌ పెవిలియన్‌కు చేర్చాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన ధనుంజయ డిసిల్వ చివరి వరకు క్రీజులో ఉండి లంక విజయంలో కీలక పాత్ర పోషించాడు. చివర్లో మ్యాచ్‌ ఉత్కంఠభరితంగా మారింది. లంక విజయానికి ఆఖరి ఓవర్‌లో 8 పరుగులు అవసరం కాగా.. డిసిల్వ సునాయసంగా లంకను విజయతీరాలకు చేర్చాడు.