Sri Lankan Cricketer Suspended: దనుష్క గుణతిలకను అన్ని ఫార్మాట్ల నుంచి సస్పెండ్ చేసిన శ్రీలంక క్రికెట్ బోర్డు ..

లైంగిక వేధింపుల కేసులో ఆస్ట్రేలియాలో అరెస్ట్ అయిన శ్రీలంక బ్యాటర్ దనుష్క గుణతిలకపై శ్రీలంక క్రికెట్ బోర్డు వేటువేసింది. అతన్ని అన్ని ఫార్మాట్ల నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు బోర్డు ప్రకటించింది.

Sri Lankan Cricketer Suspended: దనుష్క గుణతిలకను అన్ని ఫార్మాట్ల నుంచి సస్పెండ్ చేసిన శ్రీలంక క్రికెట్ బోర్డు ..

Sri Lanka Cricket player Danushka Gunathilaka

Sri Lankan Cricketer Suspended: లైంగిక వేధింపుల కేసులో ఆస్ట్రేలియాలో అరెస్ట్ అయిన శ్రీలంక బ్యాటర్ దనుష్క గుణతిలకపై శ్రీలంక క్రికెట్ బోర్డు వేటువేసింది. అతన్ని అన్ని ఫార్మాట్ల నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు బోర్డు ప్రకటించింది. ఆస్ట్రేలియాలో గణతిలకపై నమోదైన కోర్టు కేసు ముగిసిన తర్వాత, దోషిగా తేలితే ఆటగాడికి జరిమానా విధించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని క్రికెట్ బోర్డు పేర్కొంది.

T20 World Cup 2022: ఆస్ట్రేలియాలో అత్యాచార కేసులో శ్రీలంక బ్యాట్స్‌మన్ దనుష్క గుణతిలకా అర్ధరాత్రి అరెస్టు

ఆస్ట్రేలియాలో టీ20 వరల్డ్ కప్ టోర్నీ జరుగుతుంది. ఈ టోర్నీలో శ్రీలంక జట్టు పాల్గొంది. అయితే, ఓ 29ఏళ్ల మహిళ ఆన్‌లైన్ డేటింగ్ అప్లికేషన్ ద్వారా చాలారోజుల పాటు అతనితో టచ్‌లో ఉంది. వీరిద్దరూ నవంబర్ 2న రోజ్ బేలోని ఓ హోటల్ గదిలో కలుసుకున్నారు. సాయంత్రం తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.  విచారణ అనంతరం  ఆదివారం తెల్లవారు జామున అత్యాచారం ఆరోపణలపై దనుష్క గుణతిలకను సిడ్నీ పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం డౌనింగ్ సెంటర్ లోకల్ కోర్ట్‌కు  వీడియో లింక్ ద్వారా హాజరుపర్చారు. అతని న్యాయవాది  దరఖాస్తును కోర్టు తిరస్కరించింది.

మరోవైపు సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో ఇంగ్లండ్ చేతిలో ఓడిపోయిన శ్రీలంక జట్టు గణతిలక లేకుండా స్వదేశానికి వెనుదిరిగింది శ్రీలంక క్రికెట్ బోర్డు ఎగ్జిక్యూటీవ్ కమిటీ నిర్ణయం మేరకు లంక జాతీయ క్రికెటర్ దనుష్క గణతిలకను అన్ని ఫార్మాట్ల నుంచి సస్పెండ్ చేశామని, సిడ్నీలో అరెస్టు అయినట్లు తెలిసిన వెంటనే ఇది అమల్లోకి వచ్చిందని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు తెలిపింది. ఎలాంటి సెలెక్షన్లకు అతడిని పరిగణలోకి తీసుకోవడం జరగదని తెలిపింది. దీనికితోడు నేరారోపణలపై అవసరమైన సమగ్ర దర్యాప్తును చేపట్టేందుకు కార్యాచరణను రూపొందిస్తామని, ఆస్ట్రేలియాలో కోర్టు కేసు ముగిసిన అనంతరం గణతిలక దోషిగా తేలితే జరిమానా విధించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని శ్రీలంక క్రికెట్ బోర్డు సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది.